సీఎం విజయ్ ఆవు – మేక పథకం : అప్పట్లో జయలలిత మాదిరిగానే..

Share: X Facebook
tn-budget-2026-jayalalithaa-s-free-milch-cow-scheme-revived-goat-rearing-programme-for-women-launched_UEywCLBZ2r

విజయ్ ప్రభుత్వం పశుసంపద రంగంలో కొత్త మలుపు

Indiabreakingdaily.com – స ఎ వ జయ ఆవ – తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంక్షేమ కార్యక్రమాల దిశలో గణనీయమైన అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న ఈ ప్రభుత్వం, బలహీన వర్గాల మహిళలకు ఉచిత ఆవులు, మేకల పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధిని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

జయలలిత పథకం పునరుద్ధరణ

మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రవేశపెట్టిన ఉచిత ఆవు పథకాన్ని విజయ్ సర్కార్ పునరుద్ధరించింది. అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ పథకానికి ప్రత్యేక నిధులు కేటాయించారు. ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ వివరిస్తూ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు పాడి పరిశ్రమ ద్వారా ఆదాయం పెంచేందుకు ప్రతి సంవత్సరం పది వేల మంది అర్హులైన మహిళలకు ఉచితంగా పాలిచ్చే ఆవులను అందించనున్నట్లు తెలిపారు. ఈ పథకానికి రూ.57 కోట్లు ఖర్చు చేయనున్నారు.

వెట్రి మగళిర్ మేకల పెంపకం పథకం

అదేవిధంగా వెట్రి మగళిర్ మేకల పెంపకం పథకం కింద అనేక వర్గాల మహిళలకు మేకలు, గొర్రెలను ఉచితంగా అందించనున్నారు. నిరుపేద వితంతువులు, భర్తలు వదిలేసిన మహిళలు, ట్రాన్స్ జెండర్లు మరియు దివ్యాంగులు ఈ పథకం నుండి ప్రయోజనం పొందనున్నారు. ప్రతి ఒక్కరికి ఐదు మేకలు లేదా గొర్రెలను ఇవ్వనున్నారు. రూ.110 కోట్ల వ్యయంతో ఈ పథకం ప్రారంభించబడుతుంది. దీని ద్వారా మొత్తం 30 వేల మంది లబ్ది పొందనున్నారు.

పశువైద్య మౌలిక సదుపాయాల విస్తరణ

పాడి రైతులను నష్టాల నుండి కాపాడటానికి ‘కాలనడైగల్ కాప్పోమ్’ పశుసంపద బీమా పథకానికి రూ.31 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పశువైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. 41 కొత్త పశువైద్య ఆసుపత్రులను నిర్మించనున్నారు. అలాగే 25 ఆసుపత్రులను పాలిక్లినిక్‌లుగా మార్చనున్నారు. 210 డిస్పెన్సరీలను పశువైద్య ఆసుపత్రులుగా ఉన్నతీకరించనున్నారు. మారుమూల ప్రాంతాల్లో పశు ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరించడానికి 143 కొత్త మొబైల్ పశువైద్య యూనిట్లను కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు పాడి పరిశ్రమ ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునే విధంగా ప్రతి సంవత్సరం పది వేల మంది అర్హులైన మహిళలకు రూ.57 కోట్లతో ఉచితంగా పాలిచ్చే ఆవులను అందించనున్నట్లు తెలిపారు ఆర్థిక మంత్రి మేరీ విల్సన్.

Frequently Asked Questions

What is స ఎ వ జయ ఆవ?

స ఎ వ జయ ఆవ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does స ఎ వ జయ ఆవ matter?

స ఎ వ జయ ఆవ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *