Indiabreakingdaily.com – కరీంనగర్, వెలుగు : కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారి(ఎన్ హెచ్563) మీదుగా వెళ్లే వాహనదారులకు గురువారం ఉదయం నుంచి టోల్ బాదుడు షురూ కానుంది. ఈ మేరకు భారత జాతీయ రహదారుల సంస్థ(ఎన్ హెచ్ఏఐ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రహదారిపై సెప్టెంబర్ 5 నుంచి ఉచిత ట్రయల్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద ఏర్పాటు చేసిన ఈ టోల్ ప్లాజాలో గురువారం ఉదయం 8 గంటల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేయనున్నారు. ఆర్టీసీ బస్సులపై టోల్ ట్యాక్స్ విధించే కారణంగా ఈ మార్గంలో ఒక్కో బస్సు టికెట్ పై రూ.10 అదనంగా చార్జీ పెంచే అవకాశం ఉంది.
సాధారణ కార్లు, జీపులు, వ్యాన్లు లేదా లైట్ మోటార్ వాహనాలకు(ఎల్ఎంవీ) సింగిల్ జర్నీకి రూ.160, అదే రోజు తిరుగు ప్రయాణానికి (రిటర్న్ జర్నీ) రూ. 235 చొప్పున ఫీజు నిర్ణయించారు. ఈ తరహా వెహికల్స్ కు నెలకు 50 ప్రయాణాల కోసం జారీ చేసే నెలవారీ పాస్ ధర రూ. 5,250గా నిర్ణయించారు.
కరీంనగర్ జిల్లా పరిధిలో నమోదైన కమర్షియల్ వెహికల్స్(టీఎస్02)కు రూ.80గా నిశ్చయించారు. లైట్ కమర్షియల్ వెహికల్స్, మినీ బస్సులకు సింగిల్ జర్నీకి రూ. 255, రిటర్న్ జర్నీకి రూ. 380, నెలవారీ పాస్‌కు రూ. 8,485, జిల్లా కమర్షియల్ వాహనాలకు రూ.125 వసూలు చేయనున్నారు.
రెండు ఇరుసులు కలిగిన బస్సులు లేదా ట్రక్కుల సింగిల్ జర్నీకి రూ.535, రిటర్న్ జర్నీకి రూ.800, నెలవారీ పాస్‌కు రూ.17,775, కరీంనగర్ జిల్లాలోని కమర్షియల్ కేటగిరీకి రూ. 265 చెల్లించాల్సి ఉంటుంది. మూడు ఇరుసుల కమర్షియల్ వెహికల్స్ కు వరుసగా రూ.580, రూ.875, నెలవారీ పాస్‌కు రూ.19,390 , జిల్లా వాహనాలకు రూ.290 గా చార్జీలను ఖరారు చేశారు.
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. బసంత్‌నగర్ సిమెంట్ ఫ్యాక్టరీతో పాటు కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమ, జగిత్యాల మామిడి, సిరిసిల్ల వస్త్ర ఉత్పత్తులు ఈ మార్గం గుండానే విజయవాడ మీదుగా మచిలీపట్నం పోర్టుకు రవాణా అవుతుంటాయి. ఇలాంటి వాహనాలపై ట్యాక్స్ ఎక్కువగా పడనుంది.
హెవీ కన్ స్ట్రక్షన్ మిషనరీ(హెచ్ సీఎం) లేదా ఎర్త్ మూవింగ్ ఎక్విప్ మెంట్(ఈఎంఈ), మల్టీ యాక్సిల్ వెహికల్స్ కు(4 నుంచి 6 ఇరుసులు) సింగిల్ జర్నీకి రూ. 835, రిటర్న్ జర్నీకి రూ.1,255, నెలవారీ పాస్ కోసం రూ. 27,870 గా నిర్ణయించారు. 7 లేదా అంతకంటే ఎక్కువ ఇరుసులు ఉన్న అతి పెద్ద వాహనాలకు అత్యధికంగా సింగిల్ జర్నీకి రూ.1020, రిటర్న్ జర్నీకి రూ. 1,525, నెలవారీ పాస్‌కు రూ. 33,930, అవే కరీంనగర్ జిల్లాకు చెందిన వెహికల్స్ అయితే రూ.510 చొప్పున టోల్ వసూలు చేయనున్నారు. ఈ టోల్ భారంతో రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం చూపే చాన్స్ ఉంది.
టోల్ ప్లాజా పరిసరాల గ్రామాల ప్రజలకు నేషనల్ హైవే అథారిటీ కొంత ఊరటనిచ్చింది. టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానిక నాన్-కమర్షియల్(సొంత) వాహనదారులకు నెలకు రూ.360కే నెలవారీ పాస్ సదుపాయాన్ని కల్పించారు. కరీంనగర్, హన్మకొండ పరిసర ప్రాంతాల గుండా ప్రయాణించే వాహనదారులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Related Reading
Frequently Asked Questions
What is అక ట బర 15 న చ ఎన?
అక ట బర 15 న చ ఎన is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does అక ట బర 15 న చ ఎన matter?
అక ట బర 15 న చ ఎన matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.



