నాబిడ్డకు ఇది పునర్జన్మ..దత్తత తీసుకొని భవిష్యత్తుకు సాయం చేయండి : మోదీని తిట్టిన బాలికతల్లి విజ్ణప్తి

Share: X Facebook
90c68b97-d0c5-47bd-910b-ac22f1ce521c-0

జంతర్ మంతర్‌లో మోదీని తిట్టిన బాలిక తల్లి క్షమాపణలు, దత్తత కోరికలు

Indiabreakingdaily.com – న బ డ డక ఇద ప నర – ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ నిరసన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభ్యంతరకరంగా వ్యవహరించిన బాలిక తల్లి ఆయనకు క్షమాపణలు చెప్పారు. తన కూతురు చేసిన తప్పులను మన్నించి, చర్యలు తీసుకోకుండా క్షమించిన మోదీని ఆమె ప్రశంసించారు. ఈ సంఘటన తన బిడ్డకు పునర్జన్మ లాంటిదని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా విజ్ఞప్తి

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ, ప్రధాని దేశానికి రాజు అని పేర్కొంటూ ఆయన గొప్ప గుణాన్ని చాటుకున్నారని అన్నారు. తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పటికీ చిన్నారిని క్షమించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ రోజు నా కూతురి పుట్టినరోజు, ప్రధాని మోదీ నుంచే వచ్చిన ఆమెకు లభించిన గొప్ప బహుమతి ఇది. ఆయనకు నేను మనస్ఫూర్తిగా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆమెకు ఆయన జీవదానం చేశారు. ఈ రోజు నా కూతురికి పునర్జన్మ లాంటిది అని చెప్పారు.

బాలికను దత్తత తీసుకోవాలని ప్రధానిని అభ్యర్థన

తన కుమార్తెను దత్తత తీసుకుని ఆమె భవిష్యత్తును తీర్చిదిద్దాలని బాలిక తల్లి ప్రధానిని కోరారు. గ్రామాలను దత్తత తీసుకుని మెరుగైన భారతదేశాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నట్లే, దయచేసి నా బిడ్డను కూడా మీ మార్గదర్శకత్వంలోకి తీసుకుని ఆమె జీవితాన్ని పునర్నిర్మించుకోవడంలో సాయం చేయాలని అన్నారు. ఆమెకు కూడా కుటుంబం ప్రేమ, మద్దతు అందేలా చూడాలని ఆమె అభ్యర్థించారు.

మరోవైపు బాలికపై ఉన్న కేసులను ఎత్తివేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు ఆమె తల్లి. ఆమెపై నమోదు అయిన కేసులను ఎత్తివేసి ఆమె ప్రశాంతంగా జీవించేలా చూడాలని కోరారు.

ఆన్‌లైన్ వేధింపులపై ఆందోళన

ఢిల్లీ సంఘటన తర్వాత తన కుటుంబాన్ని ఆన్‌లైన్‌లో వేధించారని బాలిక తల్లి ఆందోళన వ్యక్తం చేసింది. నేను ఇన్‌స్టాగ్రామ్ వాడను. మొదటి సారి నేను ఇన్‌స్టాగ్రామ్ చూసినప్పుడు ఆన్‌లైన్ కామెంట్స్ మా కుటుంబాన్ని బాధించాయని అన్నారు. ఇలాంటి వాళ్ల తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవాలని చుట్టుపక్కల వారు అంటున్నారు. నాకు ఎలా అనిపించిందో చెప్పడానికి మాటలు రావడం లేదు. ఇది కేవలం నా కూతురి విషయం మాత్రమే కాదు. దేశ వ్యాప్తంగా ఎంతో మంది పిల్లల పరిస్థితి కూడా ఇదే అన్నారు.

మైనర్ల రక్షణ కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి

మైనర్లకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన బాలిక తల్లి, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వాడకుండా నిషేధించాలని, అదేవిధంగా 18 ఏళ్ల లోపు వారు నిరసనల్లో పాల్గొనకుండా చూడాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

ప్రధానమంత్రి మోదీకి నా విన్నపం ఏమిటంటే, దయచేసి 10 నుండి 20 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లల కోసం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను నిషేధించండి. వారిని కేవలం చదువుపైనే దృష్టి పెట్టనివ్వండి. వారిని నిరసనలు లేదా అలాంటి కార్యకలాపాలలోకి లాగకూడదు. 18 ఏళ్ల లోపు పిల్లలను వీటిలో పాల్గొనడానికి అనుమతించకూడదు, ఎందుకంటే వారిని తరచుగా ఇతరులు దుర్వినియోగం చేస్తుంటారు. ఈ పిల్లలు సులభంగా ప్రభావితమవుతారు. వారికి ఇంకా ప్రపంచం, సమాజం, లేదా పెద్దలను ఎలా గౌరవించాలో అర్థం కాదు. ఏది మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, లేదా ఎవరితో మాట్లాడాలో వారికి తెలియదు.

ఇదిలా ఉంటే, అంతకుముందు ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. నిరసనల సమయంలో తనను దూషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులను తాను క్షమించినట్లు ప్రకటించారు. వారికి శిక్ష విధించకుండా, సమాజం వారికి మార్గ నిర్దేశం చేయాలని కోరారు.

A post shared by Press Trust of India (PTI) (@ptinews_multimedia)

Frequently Asked Questions

What is న బ డ డక ఇద ప నర?

న బ డ డక ఇద ప నర is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does న బ డ డక ఇద ప నర matter?

న బ డ డక ఇద ప నర matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *