జెన్-Z కు ఎర్లీగా బట్టతల.. స్టార్టప్లకు బిలియన్ డాలర్ అవకాశం.. పోటీపడుతున్న కంపెనీలు

Share: X Facebook
4be10801-aad4-434a-b8ef-284a090a5a61-0

Indiabreakingdaily.com – ఒకప్పుడు 35 నుంచి 40 ఏళ్లలో వచ్చే బట్టతల సమస్య ఇప్పుడు ఎర్లీ ట్వంటీస్ లోనే.. అంటే 20 ఏళ్ల నుంచే వస్తోంది. కనీసం పెళ్లి కాకుండా.. సగం వయసు మల్లకుండా బట్టతల రావడమేంటని.. యంగ్ ఏజ్ లో మిడిల్ ఏజ్ ఛాయలు కనిపించడంపై జెన్ జెడ్ లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధమవుతున్నారు. దీన్నే కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. అతి పెద్ద బిజినెస్ అవకాశంగా భావిస్తూ స్టార్టప్స్ పుట్టుకొస్తున్నాయి.

ఇరవై రెండేళ్ల రోహన్‌కు మొదటిసారి ఫోటోలో కనిపించింది. స్నేహితుడు పెళ్లి ఫోటోలో ట్యాగ్ చేయగా, ఫ్లాష్‌లో అతని జుట్టు రేఖ వెనక్కి పోయినట్లు స్పష్టంగా కనిపించింది. అద్దంలో గమనించని విషయం ఫోటోలో బయటపడింది. ఇలాంటి సమస్య ఇండియాలోని చాలా సిటీల్లో చాలా మంది యువకుల్లో కనిపిస్తోంది. దీంతో ఇరవైల ప్రారంభంలోనే డెర్మటాలజిస్టులను సంప్రదిస్తున్నారు. గతంలో నలభైల్లో వచ్చే సమస్య ఇప్పుడు ఇరవైల్లోనే కనిపించడం ఆందోళన కలిగించే అంశం.

వీఎల్‌సీసీ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక కేశవ్ చెప్పిన ప్రకారం, 20 ఏళ్ల కింద జుట్టు రాలే సమస్యతో వచ్చేవారు సాధారణంగా 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారు. ఇప్పుడు చాలా మంది టీనేజర్లు, ఇరవైల ప్రారంభంలోనే ఈ సమస్యతో డెర్మటాలజిస్టుల దగ్గరకు పరుగు పెడుతున్నారు. సెల్ఫీలు, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటి వల్ల యూత్ తమ జుట్టులో వచ్చిన మార్పును గమనించడం తేలిక అయిపోయింది. అయితే ఇది కేవలం మానసిక విషయం కాదు. ఇది చాలా మందిని వేధిస్తున్న సమస్య.

మోడ్రన్ సిటీ లైఫ్ జుట్టు కణాలపై ప్రభావం చూపుతోంది. ప్రాసెస్డ్ ఆహారం, నిద్ర లేకపోవడం, ఉద్యోగ ఒత్తిడి, కాలుష్యం వంటివి శరీరంలో ఇన్ ఫ్లేమేషన్ పెంచుతున్నాయి. ఇది జుట్టు ముందుగానే రాలటానికి కారణం అవుతోందని ఆయన చెప్పారు.

ఇండస్ట్రీ రీసెర్చ్ ఫర్మ్ రెడ్‌సీర్ అంచనా ప్రకారం, పట్టణాల్లో 8.2 కోట్ల మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. వీరిలో చాలా మంది ఇంటి దగ్గరనే చికిత్స చేసుకుంటున్నారు. 5.9 కోట్ల మంది హోమ్ రెమెడీలు వాడుతున్నారు. 1.6 కోట్ల మంది షాంపూ లేదా సీరం కొనుక్కుంటున్నారు. కేవలం 50 లక్షల మంది మాత్రమే మెడికేటెడ్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. క్లినిక్‌కు వచ్చేవారు కేవలం 10 లక్షల మంది మాత్రమే.

ఇండియాలో ఇది పెద్ద మార్కెట్‌గా మారుతోంది. జుట్టు రాలే చికిత్స విభాగం 2024లో సుమారు 282 మిలియన్ డాలర్లు మార్కెట్ అయితే.. ఇది 539 మిలియన్ డాలర్లు దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. హెయిర్ కేర్ మార్కెట్ 2026లో సుమారు 4.1 బిలియన్ డాలర్లు ఉంటే, 2031 నాటికి 5.2 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.

ఇండియాలో ఉన్న సమస్యను బాగా క్యాష్ చేసుకుంటున్న బ్రాండ్‌లలో ట్రయా (Traya) ఒకటి. 2019లో ముంబైలో స్థాపించిన ఈ కంపెనీ జుట్టు రాలడాన్ని కేవలం కాస్మెటిక్ సమస్యగా కాకుండా ఆరోగ్య హెల్త్ సమస్యగా చెబుతూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. కస్టమర్లు ఆన్‌లైన్ టెస్ట్ చేసుకుని, అలోపతి, ఆయుర్వేదం, పోషకాహారం కలిపిన పర్సనల్ ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

ALSO READ : తల్లి పాలు.. తొలి పోషకాహారం.. చిన్నారి జీవితానికి మొదటి రక్షణ కవచం…

ట్రయా ఇప్పటివరకు సుమారు 18.7 మిలియన్ డాలర్లు నిధులు సమీకరించింది. దీని విలువ 135 మిలియన్ డాలర్లు పైన ఉందని తెలుస్తోంది. రూ. 2,000 కోట్ల రెవెన్యూ లక్ష్యంతో పనిచేస్తోంది. టైర్-2, టైర్-3 సిటీల నుంచి 70 శాతం కస్టమర్లు వస్తున్నారని కో-ఫౌండర్ సలోని ఆనంద్ చెప్పారు.

అయితే సమస్యను ముందుగానే గుర్తించి, సరైన నిర్ధారణ చేసుకోవాలి. ఇంటర్నెట్‌లో దొరికే చిట్కాలతో నెలలు నెలలు సమయం వృధా చేయకుండా.. డాక్టర్ల సలహా మేరకు ట్రీట్ మెంట్ తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు.

Frequently Asked Questions

What is జ న Z క ఎర ల గ?

జ న Z క ఎర ల గ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does జ న Z క ఎర ల గ matter?

జ న Z క ఎర ల గ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *