RAW NTR ప్రెస్ మీట్ తిరుపతిలో ఉంటుందని ప్రకటించారు
Indiabreakingdaily.com – తిరుపతిలో నందమూరి తారక రామారావు పేరుతో ప్రచారం జరుగుతున్న కార్యక్రమంలో సుమారు రూ.100 కోట్ల సేవా యజ్ఞం జరుగుతున్నట్లు పేర్కొని వివరణ అందజేశారు. ఈ క్రమంలో తాజ్ హోటల్ లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు RAW NTR సంస్థ తెలియజేసింది. అయితే పోలీసులకు భద్రత కల్పించాలని హోటల్ యాజమాన్యం తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించింది.
హోటల్ పై భద్రత కోరుతున్న యాజమాన్యం
రేపు (జులై 18, 2026) ఉదయం తాజ్ హోటల్ లో జరగనున్న RAW NTR అసోసియేషన్ ప్రెస్ మీట్ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సంస్థతో వివాదం నడుస్తున్నట్లు స్పష్టం అయింది. ఈ వివాదం కోసం హోటల్ యాజమాన్యం తిరుపతి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా హోటల్ పై అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూపించాలని కోరింది. ఈ విషయంలో తిరుపతి రూరల్ సీఐ మద్దయ్య చారి స్పష్టం చేశారు.
జూ.ఎన్టీఆర్ ఆఫీస్ కీలక ప్రకటన.. ఈనెల 18న కార్యక్రమంపై స్పందించిన #JrNTR ఆఫీస్ RAW NTR సంస్థ కార్యకలాపాలతో సంబంధం లేదు.. RAW NTR సంస్థతో తమకెలాంటి సంబంధంలేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రకటన తెర వెనుక బుజ్జగింపులు జరిగి ఉంటాయా..? అని అనుమానిస్తున్న రాజకీయ విశ్లేషకులు
RAW NTR ఫౌండర్ సాయి రూప్ మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాల మధ్య నెలకొన్న వివాదం తిరుపతిలో శనివారం ఎటు వైపుకు దారితీస్తుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ పేరును ఉపయోగిస్తూ అభిమానులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఊరు వాడ పేరుతో 100 కోట్ల అభివృద్ధి పనులంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అభిమానులు ఎవరూ తిరుపతికి వెళ్లొద్దని కృష్ణ యాదవ్ సూచించారు. ఈ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ పై తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించి తమకు ఎదురు సమాధానం ఇస్తామని సంస్థ తెలిపింది.




