తెలంగాణలో భారీ వర్షాలకు IMD సిద్ధం
Indiabreakingdaily.com – ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పొద్దున్నుంచి ఉక్కపోతతో ఉన్న వాతావరణం సాయంత్రం వరకు వర్షాలు దంచికొట్టాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, పంజాగుట్ట, బోయిన్ పల్లి, ఈసీఐఎల్, కాచిగూడ, మలక్ పేట, ఉప్పల్, మణికొండ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వానల వల్ల వేడి నుంచి కొంత ఉపశమనం లభించిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
18 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆయా జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
సోమవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, జనగాం, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని శాఖ తెలిపింది.
గత కొద్దిరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నప్పటికీ అంచనాలకు తగ్గట్టుగా వర్షాలు పడలేదు. చాలా జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వానలకోసం రైతులు ఎదురు చూస్తున్నారు. చాలా చోట్ల కప్పతల్లి ఆటలు, గ్రామ దేవతలకు జలాభిషేకాలు చేశారు. వర్షాకాలం సీజన్ ప్రారంభంలో ఎల్నినో ప్రభావంతో నెల రోజులు వర్షాలు లేట్ అయినప్పటికీ తిరిగి రుతుపవనాలు పుంజుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు మొదలయ్యాయి.
గత నాలుగు రోజులుగా పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షం పడటంతో రైతులు వానలకోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ వారికి గుడ్ న్యూస్ అందింది. దాదాపు రాష్ట్రంలో 70 శాతం జిల్లాల్లో రాబోయే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
Related Reading
Frequently Asked Questions
What is Rain Alert?
Rain Alert is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does Rain Alert matter?
Rain Alert matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.




