వేడి నీళ్లుగా పసిఫిక్ మహాసముద్రం: ఎన్‌నినో ప్రళయం రాబోతుందా..!

super-el-nino-intensifies-pacific-temperatures-hit-all-time-high-in-september-2026_pag625iKlc

Indiabreakingdaily.com – వ డ న ళ ల గ పస – రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్న ఎల్‌నినో ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి చేరుకున్నాయి. క్యూపర్నిసస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎల్ నినోను పర్యవేక్షించే కీలక ప్రాంతమైన 'నినో3.4' జోన్‌లో సెప్టెంబర్ నెలలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 29.70 డిగ్రీల సెల్సియస్‌ను తాకాయి. 1982-83, 1997-98, 2015-16 సంవత్సరాల్లో వచ్చిన తీవ్రమైన ఎల్‌నినో గరిష్ట స్థాయిలకంటే ఇది చాలా ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ ఏడాది చివరి నాటికి ఎల్ నినో ఎఫెక్ట్ మరింత ఊహించని స్థాయిలకు చేరుకోనుందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిస్తోంది. వచ్చే ఫిబ్రవరి 2027 నాటికి ఎల్ నినో కొనసాగేందుకు దాదాపు 100 శాతం అవకాశం ఉందని, 1950 తర్వాత అత్యంత బలమైన ఎల్ నినోలలో ఇది ఒకటిగా నిలవవచ్చని డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ సెలెస్ సాలో పేర్కొన్నారు. ప్రపంచ సముద్ర ఉపరితల సగటు ఉష్ణోగ్రత సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో 21.05 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. పారిస్ వాతావరణ ఒప్పందంలో నిర్దేశించిన 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పరిమితిని దాటడం రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఖాయమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారతదేశంపై ఎల్‌నినో ప్రభావం: భారతదేశంలో ఎల్‌నినో ప్రభావం రుతుపవనాలపై తీవ్రంగా ఉంటుంది. ఇది సాధారణంగా బలహీనమైన వర్షపాతానికి దారితీస్తుంది. 2026 నైరుతి రుతుపవనాల కాలం ముగిసేసరికి దేశంలో 12.6 శాతం లోటు వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ లెక్కల ప్రకారం.. దీర్ఘకాలిక సగటు 868.6 మి.మీ కాగా, కేవలం 759.4 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. 2015 తర్వాత ఇదే అత్యంత బలహీనమైన వర్షాకాలం.

ముఖ్యంగా తూర్పు, ఈశాన్య భారతదేశంలో సుమారు 25.6 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అక్టోబర్‌లో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉండొచ్చని ఐఎండీ అంచనా వేసింది. ఇది రబీ పంటల సాగుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనివల్ల ఆహారధాన్యాల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ముప్పు పెరుగుతుందని RBI ఇప్పటికే హెచ్చరించింది.

ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఈ ఎల్ నినో చక్రం ప్రపంచవ్యాప్తంగా వర్షపాత సరళిని మార్చివేస్తూ.. కరువు కాటకాలు, వరదల ముప్పును తీవ్రతరం చేస్తోంది. మనిషి సృష్టిస్తున్న గ్లోబల్ వార్మింగ్‌కు తోడు ఈ సూపర్ ఎల్‌నినో రాబోయే కాలంలో వాతావరణ మార్పులను మరింత వేగవంతం చేస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Frequently Asked Questions

What is వ డ న ళ ల గ పస?

వ డ న ళ ల గ పస is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does వ డ న ళ ల గ పస matter?

వ డ న ళ ల గ పస matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *