రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే

Share: X Facebook
cjp-will-remain-a-pressure-group-to-fight-for-issues-no-plans-to-enter-politicsfounder-abhijit-deepke_vZu8iUXDmy

సీజేపీ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదు: వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే

Indiabreakingdaily.com – ర జక య ల ల క వచ – ఛత్రపతి శంభాజీనగర్‌లో బుధవారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న సీజేపీ కోర్ టీమ్ సమావేశానికి ముందు వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం భారతదేశానికి ఒత్తిడి బృందమే అవసరమని ఆయన స్పష్టం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయ పార్టీగా మారే ఆలోచన లేదని వెల్లడించారు.

మీడియా ప్రతినిధులు సీజేపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందా అని ప్రశ్నించగా.. దీప్కే చమత్కరించారు. ఈ విషయంలో తమ కంటే మీడియానే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ పార్టీల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆయన విమర్శించారు. ప్రజలు ఉదయం ఒక పార్టీకి ఓటు వేస్తే.. సాయంత్రానికల్లా వేరొకరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

జంతర్ మంతర్ ఆందోళనకు దేశవ్యాప్త మద్దతు

ప్రజలు న్యాయవ్యవస్థ, రాజకీయాలు, మీడియా, ఎన్నికల సంఘంపై విశ్వాసం కోల్పోయారని దీప్కే పేర్కొన్నారు. జంతర్‌మంతర్‌వద్ద చేపట్టిన తమ ఆందోళనకు దేశవ్యాప్త మద్దతు లభించిందని.. ఆందోళన పెరిగేకొద్దీ ఆ మద్దతు కేవలం విద్యా సమస్యలకే పరిమితం కాలేదని.. ఈ సంస్థలకు కూడా విస్తరించిందన్నారు.

న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మేము చేపట్టిన ఆందోళనకు దేశవ్యాప్త స్పందన లభించింది. దీంతో మాపై బాధ్యత పెరిగింది. మాపై ప్రజల అంచనాలు కూడా పెరిగాయి.

అందువల్ల, ఈ సంస్థలలో జవాబుదారీతనం తీసుకురావడానికి ఒక ప్రజా ఒత్తిడి బృందం అవసరమని దీప్కే అన్నారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రెషర్ గ్రూపుగా తాము ఉంటామని వెల్లడించారు.

కోర్ టీమ్ సమావేశంలో చర్చించే అంశాలు

కోర్ టీమ్ సమావేశంలో తమ సంస్థ ఎలా ఎదగాలో నిర్ణయించడంతో పాటు భవిష్యత్తు కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందిస్తాము. మీడియా, న్యాయవ్యవస్థ వంటి సంస్థలపై ప్రజల విశ్వాసం సన్నగిల్లడంపైనా ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. అలాగే, ఇథనాల్ మిశ్రమ ఇంధనం, పెరుగుతున్న నిరుద్యోగం వంటి సమస్యలను కూడా చర్చిస్తామని దీప్కే వివరించారు.

సీజేపీ కోర్ టీమ్ సమావేశం గురువారం కూడా కొనసాగుతుందని, మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాల గురించి గురువారమే తెలియజేస్తామని దీప్కే చెప్పారు. ఈ మీటింగ్‌లో దీప్కే, సీజేపీ చీఫ్‌స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్, సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, రత్న సింగ్ తదితరులు పాల్గొన్నారు.

జార్ఖండ్‌లోని నిరసనకారులకు మద్దతు

జార్ఖండ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలో జేపీఎస్‌‌‌‌‌‌‌‌సీ ఇతర నియామక పరీక్షలలో జరిగిన అవకతవకలపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు సీజేపీ మద్దతు ప్రకటించింది. జులై 29 నుంచి రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో నిరవధిక దీక్ష చేస్తున్న నిరుద్యోగులకు మద్దతు తెలిపేందుకు సీజేపీ సభ్యులు జార్ఖండ్‌‌‌‌‌‌‌‌కు వెళ్తారని దీప్కే తెలిపారు.

మేం కచ్చితంగా జార్ఖండ్‌‌‌‌‌‌‌‌కు వెళ్తాము. వారితో నిలబడతం. ఆందోళనలో వారి ప్రతి డిమాండ్‌‌‌‌‌‌‌‌కు మద్దతు ఇస్తాం.

జార్ఖండ్‌‌‌‌‌‌‌‌ లోక్‌‌‌‌‌‌‌‌తాంత్రిక్ క్రాంతికారి మోర్చా సభ్యుడు దేవేంద్ర నాథ్ మహతో గత 4 రోజులుగా నిరాహార దీక్ష చేస్తుండగా.. మంగళవారం మరో ఐదుగురు దీక్ష చేపట్టారు. దీంతో నిరాహార దీక్ష చేస్తున్న వారి సంఖ్య ఆరుకు పెరిగింది. కాగా, మహతో షుగర్, బీపీ లెవల్స్ పడిపోతున్నందున కనీసం నీళ్లైనా తాగాలని వాంగ్చుక్ సలహా ఇచ్చారు. దీంతో మహతో బుధవారం నీళ్లు తాగారు.

Frequently Asked Questions

What is ర జక య ల ల క వచ?

ర జక య ల ల క వచ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does ర జక య ల ల క వచ matter?

ర జక య ల ల క వచ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *