మోడల్ స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ అమలుకు విద్యాశాఖ సిద్ధం
Indiabreakingdaily.com – మ డల స క ళ లల స – రాష్ట్రంలోని మోడల్ విద్యాసంస్థలను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు విద్యాశాఖ కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోంది. కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీపడటానికి ప్రస్తుత రాష్ట్ర సిలబస్‌ను మార్చి సీబీఎస్ఈ పాఠ్యక్రమాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా, ప్రస్తుతం ఆరో తరగతి నుంచి ప్రారంభమవుతున్న ఈ విద్యాసంస్థల్లో ప్రీప్రైమరీ నుంచి ఐదో తరగతి వరకు కూడా తరగతులను నిర్వహించాలని నిర్ణయించారు.
తగ్గుతున్న అడ్మిషన్లకు పరిష్కారం
స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 194 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన జరుగుతోంది. దాదాపు 1.10 లక్షల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఒకప్పుడు మోడల్ స్కూళ్లలో సీటు కోసం తీవ్రమైన పోటీ ఉండేది. కానీ, కాలక్రమేణ గురుకులాల సంఖ్య పెరగడం, ప్రైవేట్ స్కూళ్ల వైపు తల్లిదండ్రులు మొగ్గుచూపడంతో అడ్మిషన్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది.
దీంతో తల్లిదండ్రులను ఆకర్షించాలంటే సీబీఎస్ఈ సిలబస్ ఒక్కటే మార్గమని అధికారులు భావిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియంతోపాటు నేషనల్ సిలబస్ అందుబాటులోకి వస్తే కార్పొరేట్ ఫీజులు భరించలేని మధ్యతరగతి కుటుంబాలు మోడల్ స్కూళ్ల వైపు వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మోడల్ స్కూళ్లు కేవలం హైస్కూల్, ఇంటర్ స్థాయిలోనే ఉన్నాయి.
ప్రైవేట్ స్కూళ్లలో ఎల్‌కేజీ నుంచే పిల్లలను చేరుస్తుండటంతో మోడల్ స్కూళ్లకు ఆరో తరగతి వచ్చేసరికి ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు రావడం లేదు. దీంతో ప్రీప్రైమరీ నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక విభాగాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. అధికారుల ఆలోచన బాగానే ఉన్నా.. దీని అమలుపై ఉపాధ్యాయ వర్గాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.
Related Reading
Frequently Asked Questions
What is మ డల స క ళ లల స?
మ డల స క ళ లల స is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does మ డల స క ళ లల స matter?
మ డల స క ళ లల స matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.



