భారత టీ20 జట్టులో భారీ మార్పులు.. జింబాబ్వే సిరీస్‌కు ఆరుగురు కొత్తవారికి అవకాశం
Indiabreakingdaily.com – భ రత జట ట ల భ ర – ఇంగ్లాండ్ పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత, టీమిండియా క్రికెట్ జట్టు తదుపరి విదేశీ పర్యటనకు సిద్ధమవుతోంది. జింబాబ్వేతో జరగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు పోటీపడనుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు జూలై 23 నుంచి హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో నిర్వహించబడతాయి.
టీ20ల్లో తన మొదటి విజయాన్ని కోరుకుంటున్న శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ జట్టులో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లకు అవకాశం లభించింది. 2026లో జరిగే మూడవ విదేశీ టీ20 సిరీస్‌కు సెలెక్టర్లు జట్టులో గణనీయమైన మార్పులు చేశారు.
జట్టులోకి తిరిగి వచ్చిన ఆటగాళ్లు
జింబాబ్వే టీ20 సిరీస్‌కు ప్రకటించిన జాబితాలో స్టార్ ఆటగాడు రింకూ సింగ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అలాగే గాయాల కారణంగా చాలా కాలం పాటు జట్టుకు దూరంగా ఉన్న పేసర్ మయాంక్ యాదవ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
అరంగేట్రం చేయబోయే కొత్తవారు
ఇప్పటి వరకు జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేయని యువ బౌలర్లు అశోక్ శర్మ, యష్ ఠాకూర్ ఈ సిరీస్ కోసం తొలిసారి బీసీసీఐ నుంచి పిలుపువచ్చింది.
వన్డేలు ఆడిన విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబేకి కూడా తొలిసారి టీ20ల్లో ఆడేందుకు కాల్ వచ్చింది. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక రన్స్ చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
జట్టుకు దూరమైన ప్లేయర్స్
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను సెలెక్టర్లు ఈ సిరీస్ కి పక్కనబెట్టారు. ఈ నిర్ణయంపై అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీపై ఫ్యాన్స్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణాలతో పాటు స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లకు ఈ సిరీస్‌లో రెస్ట్ ఇచ్చారు.
తొలుత బీసీసీఐ ప్రకటించిన జట్టులో ఉన్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో గాయపడటంతో ఈ సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అతని స్థానంలో రవి బిష్ణోయ్‌ను మళ్లీ తుది జట్టులోకి తీసుకున్నారు.
16 ఏళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న లలిత్ మోడీ.. ఐపీఎల్ మాజీ బాస్ రీఎంట్రీపై జోరుగా చర్చ!
జట్టులో స్థానం పదిలం చేసుకున్న ఆటగాళ్లు
ఇంగ్లాండ్ సిరీస్ ఆడిన జట్టు నుంచి శ్రేయస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్ తమ స్థానాలను ఫిక్స్ చేసుకున్నారు.
జింబాబ్వేతో టి20 సిరీస్‌కి భారత జట్టు
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, హర్ష్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్.




