Indiabreakingdaily.com – ఢ ల ల ద గ బ ధ – న్యూఢిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) శనివారం జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన నిరసన ప్రదర్శన దేశ రాజధానిని అతలాకుతలం చేస్తున్నది. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో ఢిల్లీ పోలీస్ యంత్రాంగం ఢిల్లీని ఏకంగా ఒక సైనిక శిబిరంగా మార్చేసింది. దాదాపు 23 వేల మందికి పైగా కేంద్ర సాయుధ బలగాల మోహరింపు, మెట్రో రాకపోకలపై ఆంక్షలు, పదుల సంఖ్యలో రైళ్ల రద్దుతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందుల పాలవుతోంది. సీజేపీ తలపెట్టిన ర్యాలీకి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు తేల్చిచెప్పారు. నిబంధనల ప్రకారం 10 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వలేదని, గతంలో జరిగిన నిరసనల్లో నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నతాధికారులు ప్రకటించారు. సెంట్రల్ ఢిల్లీలోని పలు సున్నిత ప్రాంతాల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 విధించారు. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఆందోళనకారులు సెంట్రల్ ఢిల్లీకి చేరుకోకుండా ఉండేందుకు శనివారం 57 కీలక మెట్రో స్టేషన్లను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచే ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను క్లోజ్ చేయనున్నట్టు ప్రకటించారు. రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియెట్, న్యూఢిల్లీ, పటేల్ చౌక్, జన్‌పథ్, మండి హౌస్, కశ్మీరీ గేట్, ఐటీవోలాంటి నిత్యం రద్దీగా ఉండే ప్రధాన ఇంటర్చేంజ్ స్టేషన్లు మూతపడనుండటంతో నిత్య ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నడిచే మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ కూడా తగ్గనుంది. రైల్వే వ్యవస్థపైనా ఈ ఆందోళనల ప్రభావం భారీగా పడింది. న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు చేరుకోవాల్సిన సుమారు 61 రైళ్లను శుక్ర, శనివారాల్లో రద్దు చేశారు. శుక్రవారం 40 రైళ్లు, శనివారం 21 రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాబోయే రైళ్లను.. ఆయా ప్రారంభ స్టేషన్ల వద్దే నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తమ ప్రయాణాలను సరిచూసుకోవాలని రైల్వే శాఖ సూచనలు జారీ చేసింది. జంతర్ మంతర్‌కు చుట్టు నాలుగు కిలోమీటర్ల పరిధిలో 24 గంటల పాటు ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు.
మరోవైపు ఢిల్లీ నగరమంతటా మునుపెన్నడూ లేని రీతిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు 221 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు, అదనంగా మరో 110 కంపెనీల బలగాలు కలిపి మొత్తం 23వేల మందికి పైగా సాయుధ జవాన్లు మోహరించారు. ఇందులో సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ, ఐటీబీపీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు ఉన్నాయి. పలుచోట్ల మల్టీ లెవెల్ బారికేడ్లు, కంట్రోల్ రూమ్ నుంచి సీసీటీవీల నిఘా, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పొరుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, హర్యానా పోలీసులకు కూడా హై అలర్ట్ ప్రకటించారు.
ఢిల్లీ వ్యాప్తంగా భద్రతా కారణాలు, మెట్రో సేవల అంతరాయం దృష్ట్యా పలు పాఠశాలలు, కళాశాలలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. శనివారం జరగాల్సిన ప్రత్యక్ష తరగతులను ఆన్‌లైన్‌కు మార్చడంతోపాటు, పలు పరీక్షలు, పేరెంట్-టీచర్ మీటింగ్ లను వాయిదా వేశాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా బారికేడ్లు ఏర్పాటు చేయడం, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు శనివారం తరగతులను ఆన్లైన్లో నిర్వహించనున్నట్టు సమాచారం అందించారు.
Related Reading
Frequently Asked Questions
What is ఢ ల ల ద గ బ ధ?
ఢ ల ల ద గ బ ధ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does ఢ ల ల ద గ బ ధ matter?
ఢ ల ల ద గ బ ధ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.



