జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్..చరిత్ర, నిర్మాణం, విధులు

Share: X Facebook
national-commission-for-scheduled-castes-ncsc-history-structure-constitutional-provisions_yf10BouMHs

జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్: చరిత్ర, నిర్మాణం మరియు విధులు

Indiabreakingdaily.com – జ త య ష డ య ల – భారత రాజ్యాంగం కింద షెడ్యూల్డ్ కులాల హక్కులను కాపాడే ప్రధాన సంస్థగా జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ పనిచేస్తుంది. ఈ సంస్థ దళిత సమాజానికి వివక్ష మరియు దోపిడీ నుండి రక్షణ కల్పించడంతో పాటు, వారి సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి కూడా కృషి చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ఈ కమిషన్ ఏర్పాటుకు ఆధారం అందిస్తుంది.

చరిత్ర మరియు పరిణామం

ప్రారంభంలో ఆర్టికల్ 338 ప్రకారం ఒకే ఒక అధికారిని షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల కమిషనర్‌గా నియమించారు. 1987లో పార్లమెంటు సభ్యుల ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌కు బదులుగా బహుళ సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

65వ రాజ్యాంగ సవరణ చట్టం 1990 ద్వారా ఈ మార్పులు అమలులోకి వచ్చాయి. ఈ సవరణ ఆర్టికల్ 338ని సవరించి, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల కోసం కొత్త జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కొత్త కమిషన్‌లో ఐదుగురు సభ్యులు ఉన్నారు.

2003లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ నుండి షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్‌ను వేరు చేశారు. 2004 నుండి ఎస్సీ మరియు ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు పనిచేస్తున్నాయి. షెడ్యూల్డ్ కులాల కోసం మొదటి జాతీయ కమిషన్ సూరజ్ భాన్ అధ్యక్షతన 2004లో ఏర్పడింది. ప్రస్తుతం ఏడో కమిషన్ పనిచేస్తోంది.

కమిషన్ నిర్మాణం

జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌లో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్ మరియు ముగ్గురు సభ్యులు ఉంటారు. మొత్తం ఐదుగురు సభ్యులతో ఈ కమిషన్ కూడి ఉంటుంది. రాష్ట్రపతి మూడేండ్ల పదవీ కాలానికి ఈ సభ్యులను నియమిస్తారు.

మొదటి చైర్మన్: సూరజ్ భాన్

ప్రస్తుత చైర్మన్: కిశోర్ మక్వానా

కమిషన్ విధులు

1. ఎస్సీలకు సంబంధించిన రాజ్యాంగబద్ధ మరియు చట్టబద్ధ హక్కుల అమలు తీరు, వారి సామాజిక మరియు ఆర్థిక స్థితిగతులపై పర్యవేక్షణ చేయడం.

2. ఎస్సీల సామాజిక మరియు ఆర్థిక వికాసం కోసం తగిన సూచనలు మరియు సలహాలు అందించడం.

3. వార్షిక నివేదికలను మరియు అవసరమైన సందర్భంలో ఇతర నివేదికలను రాష్ట్రపతికి సమర్పించడం.

4. రాష్ట్రపతి నివేదికను పార్లమెంట్ ముందు ఉంచడం. వీరి సూచనలపై ప్రభుత్వం చర్యలు తీసుకోని సందర్భంలో పార్లమెంట్‌కు వివరణ ఇవ్వడం.

5. రాష్ట్రపతి సూచించిన ఇతర బాధ్యతలు స్వీకరించడం. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కోరినప్పుడు ఆయా బాధ్యతలు నిర్వర్తించడం.

ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి పథకాలు

వార్షిక ఆదాయం 3 లక్షల కంటే తక్కువగా ఉన్న షెడ్యూల్డ్ కులాల కుటుంబాలకు ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి కోసం రుణ సదుపాయం అందిస్తున్నారు. ఈ సంస్థ క్రెడిట్ బేస్డ్ స్కీమ్ మరియు నాన్ క్రెడిట్ బేస్డ్ స్కీమ్ అనే రెండు రకాల పథకాలను అమలు చేస్తుంది.

క్రెడిట్ బేస్డ్ స్కీమ్‌లో భాగంగా మహిళా సంవృద్ధి యోజన, మహిళా అధికారిక యోజన, లఘు వ్యవసాయ యోజన, గ్రీన్ బిజినెస్ స్కీమ్, స్టాండప్ ఇండియా, స్వచ్ఛతా ఉదయం యోజన, అజీవక మైక్రో ఫైనాన్స్ యోజన మరియు ఉదయం నిధి యోజన తదతర పథకాలు అమలుచేస్తున్నారు. నాన్ క్రెడిట్ బేస్డ్ స్కీమ్‌లో భాగంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందిస్తున్నారు.

Frequently Asked Questions

What is జ త య ష డ య ల?

జ త య ష డ య ల is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does జ త య ష డ య ల matter?

జ త య ష డ య ల matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *