Indiabreakingdaily.com – ఏడ ద న నరల ప సర వ – ఆదిలాబాద్: రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో భూ సర్వేను చేపడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో సమీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.
రెవెన్యూ, సర్వే, హౌసింగ్, రిజిస్ట్రేషన్ శాఖల పనితీరుపై సమీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. సుమారు 120 ఏళ్ల క్రితం రాష్ట్రంలో భూ సర్వే జరిగిందని, ప్రస్తుతం మళ్లీ మూడు విడతల్లో భూ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మొదటి విడత సర్వే కొనసాగుతోందన్నారు.
భూ సర్వే కీలకమైన అంశమని, ఆర్థిక భారం ఉన్నప్పటికీ ప్రభుత్వం సర్వేను చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. ఏడాదిన్నరలోపు భూ సర్వేను పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. సర్వే అనంతరం ప్రతి భూమికి ఎల్‌పీఎం నంబర్ కేటాయించి, ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు అందించే ప్రక్రియ చేపడతామని చెప్పారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు, గిరిజనేతరులకు సంబంధించిన భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.భూ వివాదాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను మందలించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలపై నిర్వహించిన పరిశీలనలో సుమారు 73 వేల ఇళ్లు/గుడిసెలు ఉన్నట్లు గుర్తించామని మంత్రి తెలిపారు. వీటిలో అర్హులైన వారికి రెండో విడతలో ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు.తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఇప్పటివరకు 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని, రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8 లక్షల ఇళ్లను అందించినట్లు మంత్రి వెల్లడించారు.రాబోయే దసరా నాటికి మరో 2 లక్షల ఇళ్లను పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రాబోయే రోజుల్లో మరో రెండు విడతల్లో ఇళ్లను మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
Related Reading
Frequently Asked Questions
What is ఏడ ద న నరల ప సర వ?
ఏడ ద న నరల ప సర వ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does ఏడ ద న నరల ప సర వ matter?
ఏడ ద న నరల ప సర వ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.



