ఇంగ్లాండ్ కోచ్ రేసులో రాహుల్ ద్రవిడ్.. ECB షార్ట్‌లిస్ట్‌లో 9 మంది!

Share: X Facebook
rahul-dravid-in-race-to-replace-brendon-mccullum-as-england-test-coach_t6v7iakEZ8

ఇ గ ల డ క చ ర – Rahul Dravid: ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) తమ కొత్త టెస్ట్ కోచ్ కోసం తీవ్రంగా వేట కొనసాగిస్తుంది. బ్రెండన్ మెకల్లమ్‌ను కోచ్ పదవి నుంచి తొలగించిన తర్వాత, ఆ స్థానాన్ని భర్తీ చేసే రేసులో భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరు గట్టిగా వినిపించింది. కానీ, తాజాగా బ్రిటీష్ పత్రిక 'ది డైలీ మెయిల్' విడుదల చేసిన 9 మంది అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌లో ద్రవిడ్ పేరు లేకపోవడం క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. ద్రవిడ్‌తో పాటు ఇంగ్లాండ్ యాషెస్ హీరో ఆండ్రూ ఫ్లింటాఫ్ కూడా ఈ రేస్ నుంచి విధంగా తప్పుకున్నాడు.

తీవ్ర సంక్షోభంలో ఇంగ్లాండ్: ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. మెకల్లమ్ పతనం ఒకవైపు, మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అందరికీ షాక్ ఇస్తూ టెస్ట్ కెప్టెన్సీకి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ప్రస్తుతం ఇంగ్లాండ్‌కు అటు కోచ్, ఇటు కెప్టెన్ లేని పరిస్థితి ఏర్పడింది. ఆగస్టు 19 నుంచి హెడింగ్లీ వేదికగా పాకిస్తాన్‌తో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుండటంతో, ఈ లోపే కొత్త కోచ్, కెప్టెన్‌ను వెతకడానికి ఈసీబీ తీవ్రంగా శ్రమిస్తోంది.

బాజ్‌బాల్ను దెబ్బకొట్టినా దక్కని ఛాన్స్: రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని టీమిండియానే 2024 ఆరంభంలో మెకల్లమ్ బాజ్‌బాల్ ఇంగ్లాండ్ జట్టును మొదటిసారి ఓడించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాతే ఇంగ్లాండ్ వరుసగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతిలో సిరీస్‌లు ఓడిపోయింది. ద్రవిడ్ భారత్‌కు 2024 టీ20 వరల్డ్ కప్ అందించడమే కాదు, 2023 వన్డే వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలబెట్టాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ, అంతర్జాతీయంగా ఆయన ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉంది. అయినా ఇంగ్లాండ్ బోర్డు ఆయన వైపు ఇంట్రెస్ట్ చూపకపోవడం గమనార్హం.

రేసులో 9 మంది అభ్యర్థులు: రాహుల్ ద్రవిడ్ రేసులో లేకపోవడంతో.. ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ పదవి కోసం 9 మంది రేసులో ఉన్నారు. వారి వివరాలు ఇవే.

* ఆండీ ఫ్లవర్ (టాప్ ఛాయిస్): ఈసీబీ ఈయన కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు హెడ్ కోచ్‌గా ఉంటూ 2025, 2026 లలో వరుసగా బ్యాక్-టు-బ్యాక్ టైటిల్స్ అందించి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు.

* ఆస్ట్రేలియా ద్వయం: ఇంగ్లాండ్‌కు చిరకాల ప్రత్యర్థులైన ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్, ఫ్రాంచైజీల అనుభవజ్ఞుడు టామ్ మూడీ రేసులో ఉన్నారు.

మాజీ ఇంగ్లాండ్ ప్లేయర్స్: ఆఫ్ఘనిస్తాన్‌ను 2024 టీ20 వరల్డ్ కప్ సెమీస్ చేర్చిన జోనాథన్ ట్రాట్, గ్లౌసెస్టర్‌షైర్‌కు చెందిన రిచర్డ్ డాసన్.

* ఇతర గ్లోబల్ స్టార్లు: న్యూజిలాండ్‌కు చెందిన స్టీఫెన్ ఫ్లెమింగ్, మైక్ హెసన్, శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర, సౌతాఫ్రికాకు చెందిన ఆది బిరెల్ కూడా కోచ్ రేసులో ఉన్నట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *