VenkyAnil5: అనిల్ రావిపూడి మరోసారి అదరగొట్టేసాడు.. వెంకటేష్-కళ్యాణ్ రామ్ మూవీకి క్రేజీ టైటిల్!

Share: X Facebook
8b92374f-6098-414f-892b-b78edec1077f-0

VenkyAnil5 – కొంతమంది దర్శకులు సినిమాలతో మాత్రమే కాదు.. తమ ప్రమోషన్స్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అలాంటి వారిలో దర్శకుడు అనిల్ రావిపూడి ముందుంటారు. అంతేకాదు.. టాలీవుడ్‌లో సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుల్లో రాజమౌళి తర్వాత వరుస విజయాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పేరు అనిల్ రావిపూడిదే. ‘పటాస్’తో ప్రారంభమైన ఆయన విజయయాత్ర.. ఈ ఏడాది విడుదలైన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (MSG) వరకు ఎలాంటి బ్రేక్ లేకుండా కొనసాగి వరుసగా తొమ్మిది విజయాలను అందుకుంది. కమర్షియల్ ఎంటర్‌టైన్మెంట్, కామెడీ, క్రియేటివ్ ప్రమోషన్స్‌ అనే ఫార్ములాతో బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలు నమోదు చేస్తూ ఆయన దూసుకుపోతున్నారు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి.. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్నారు. జూన్ 18న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుండగా, జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.

ముఖ్యంగా సినిమా టైటిల్ విషయంలో అనిల్ మరోసారి తన మార్క్ చూపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ‘జనవరి 13 విడుదల’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దాన్ని నేరుగా ప్రకటించకుండా, ప్రత్యేకంగా రివీల్ చేసేందుకు అనిల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దీంతో అసలు ఇదే టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారా? లేక మరో సర్‌ప్రైజ్ దాగి ఉందా? అన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.

ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్‌లతో క్రియేట్ చేసిన ఫన్నీ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విశాఖ బీచ్ ఇసుకలో వారిని మెడ వరకు కప్పేసి, జంధ్యాల తరహా కామెడీని గుర్తుచేసేలా వీడియో చేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాడు. షూటింగ్ ప్రారంభం కాకముందే సినిమాను చర్చలోకి తీసుకురావడంలో అనిల్ రావిపూడి మరోసారి సక్సెస్ అయ్యారని సినీ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Excited to collaborate for the third time with dear brother @sahugarapati7 and @Shine_Screens for #VenkyAnil5 #NKRAR2 🤗🤗 Glad to have @ZeeStudios_ join this journey and the legendary @SureshProdns present it 😍👌🏻 SANKRANTHI 2027 RELEASE ✨ Victory @VenkyMama @NANDAMURIKALYAN … pic.twitter.com/zVryHSdasE

ఈ సినిమాలో హీరోయిన్ల ఎంపిక కూడా ఆసక్తికరంగా మారింది. వెంకటేష్ సరసన మహానటి కీర్తి సురేష్ నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి చెప్పిన కథా లైన్ ఆమెకు నచ్చడంతో ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక కళ్యాణ్ రామ్ సరసన 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ నుంచి రానున్న రోజుల్లో మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ వెలువడనున్నాయి.

I've always admired @gvprakash 's ability to make music that connects instantly with audiences.👌🏻 Thrilled to welcome him on board for #VenkyAnil5 – #NKRAnil2 🤗 And we had a blast pulling off this fun concept… A big thank you to GV for trusting the idea, joining in… pic.twitter.com/AeAMx5hJbd

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *