UPI పేమెంట్స్‌పై ఛార్జీలు జనవరి వరకూ వాయిదా..! కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖతో NPCI చర్చలు
Indiabreakingdaily.com – మరో వారం రోజుల్లో అంటే అక్టోబర్ 15, 2026 నుంచి దేశవ్యాప్తంగా మర్చంట్ ట్రాన్సాక్షన్స్ అంటే షాపుల్లో చేసే చెల్లింపులపై యూపీఐ ఛార్జీలను వసూలు చేయాలని మోడీ సర్కార్ ఆదేశించింది. అయితే ఈ నిర్ణయంపై ఇప్పటికే అనేక వ్యాపార సంఘాలతో పాటు చిరు వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీంతో చాలా మంది వర్తకులు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఎండీఆర్ ఛార్జీలను వచ్చే ఏడాది వరకూ ఆపాలని తాత్కాలికంగా వాయిదా కోరుతూ రిక్వెస్ట్ చేస్తున్నారు.
యూపీఐ MDR అమలును వాయిదా వేయాలని కోరుతూ మర్చెంట్ అసోసియేషన్లు, ఫిన్‌టెక్ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. విభిన్న ఎండీఆర్ రేట్లు, విధానాల వల్ల ఏర్పడిన గందరగోళం, పండుగ సీజన్ సమీపిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు జరుగుతుండగా, NPCI రాబోయే రెండు రోజుల్లో ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గత నెలలో యూపీఐ స్టీరింగ్ కమిటీ రూ.2వేల కంటే ఎక్కువ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వసూలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం రూ.2వేల ఖర్చుపై రూ.8, అలాగే రూ.10వేల చెల్లింపులపై రూ.40 ఎండీఆర్ పడుతుంది. అయితే ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో, పండుగ సీజన్ సమయంలో ఈ ఛార్జీల వల్ల బిజినెస్ ఖర్చులు పెరిగి, వినియోగదారులపై భారం పడుతుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. వ్యాపారులు ఈ భారాన్ని పరోక్షంగా వినియోగదారులపైకి మళ్లించే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
కార్డులతో పోలిస్తే యూపీఐ లావాదేవీల నిర్మాణం చాలా క్లిష్టమైనది. కార్డ్ నెట్‌వర్క్‌ల మాదిరిగా కాకుండా.. యూపీఐలో యుటిలిటీ బిల్లులు, లోన్ రీపేమెంట్లు, క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలకు వేర్వేరు రేట్లు ప్రకటించారు. లోన్ రీపేమెంట్లు, బ్రోకింగ్ ఖాతాలకు డబ్బులు జమ చేయడం వంటి వాటికి క్రెడిట్ కార్డులను రిజర్వ్ బ్యాంక్ అనుమతించదు. ఈ ప్రత్యేకమైన లావాదేవీలను ఎలా వర్గీకరించాలి, ఆటోపే ఫెయిల్ అయితే మాన్యువల్ పేమెంట్లకు వర్తించే నిబంధనలేమిటనే అంశాలపై బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లలో స్పష్టత కొరవడింది.
ఈ గందరగోళాన్ని తొలగించడానికి, పండుగ సీజన్ ముగిసే వరకు ఎండీఆర్ అమలును వాయిదా వేయాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. క్యాపిటల్ మార్కెట్లు కూడా బ్రోకింగ్ సంస్థలపై ఎండీఆర్ భారం మోపవద్దని వాదిస్తున్నాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి తగినంత సమయం కావాలని వారు కోరుతున్నారు. NPCI ఈ అభ్యర్థనలపై సానుకూలంగా స్పందించి, త్వరలోనే స్పష్టత ఇస్తుందని భావిస్తున్నాయి పేమెంట్ సంస్థలు, బ్యాంక్స్.
Related Reading
Frequently Asked Questions
What is UPI ప మ ట స ప ఛ?UPI ప మ ట స ప ఛ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does UPI ప మ ట స ప ఛ matter?UPI ప మ ట స ప ఛ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.