IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

Suriya : రాజకీయాల్లోకి హీరో సూర్య ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన స్టార్ టీమ్!

Published July 2, 2026 · Updated July 21, 2026 · By James Lopez - indiabreakingdaily.com

Foto : James Lopez - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – Suriya - తమిళనాట రాజకీయాలకు, సినీ రంగానికి విడదీయరాని బంధం ఉంది. నాటి ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత కాలం నుంచి నేటి టీవీకే అధినేత, సీఎం విజయ్ వరకు కోలీవుడ్ స్టార్స్ రాజకీయాల్లో తమ విశ్వరూపం చూపిస్తూనే ఉన్నారు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చి సంచలనాలు సృష్టిస్తున్న తరుణంలో కోలీవుడ్ కు చెందిన మరో స్టార్ హీరో సూర్య కూడా త్వరలోనే ఖద్దరు చొక్కా తొడగబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ వైబ్రేషన్స్ మొదలయ్యాయి. లారెన్స్, విశాల్, జీవీ ప్రకాశ్, త్రిష లాంటి వాళ్ల పేర్లు వినబడుతున్న తరుణంలో సూర్య పేరు తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది.

సూర్య కేవలం వెండితెరపైనే హీరో కాదు.. సమాజంలోనూ రియల్ హీరో. ఆయన స్థాపించిన 'అగరం ఫౌండేషన్' ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ అండగా నిలుస్తున్నారు. అయితే ఇటీవల చెన్నైలో జరిగిన 'సూర్య అఖిల భారత అభిమానుల పరిరక్షణ సంఘం' సమావేశంలో సంఘ ప్రతినిధి ఆర్. వీరమణి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ దుమారానికి కారణమయ్యాయి. భవిష్యత్తులో సూర్య రాజకీయాల్లోకి రావడం ఖాయమని ఆయన అనడంతో.. తమిళ మీడియాలో సూర్య పొలిటికల్ ఎంట్రీ ఖరారు అంటూ కథనాలు వెల్లువెత్తాయి.

►ALSO READ | కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్.. ధ్రువ్ విక్రమ్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్ లాంచ్!

ఈ రూమర్స్ కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ హీట్ పెంచడంతో సూర్య బృందం వెంటనే స్పందించి అధికారికంగా ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం సూర్యకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అస్సలు లేదని స్పష్టం చేసింది. మీటింగ్‌లో వీరమణి మాట్లాడిన మాటలు ఆయన వ్యక్తిగతమైనవని, దానికి సూర్యకు ఎలాంటి సంబంధం లేదని టీమ్ తేల్చేసింది. అగరం ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు కేవలం సమాజంపై బాధ్యతతో చేస్తున్నవే తప్ప, వాటి వెనుక ఎలాంటి పొలిటికల్ అజెండా లేదని గట్టిగా చెప్పింది.

ప్రస్తుతం సూర్య తన రాబోయే భారీ పాన్-ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన సేవా గుణాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని సూర్య ఆర్మీ సైతం కోరుతోంది. దీంతో సూర్య పొలిటికల్ ఎంట్రీ వార్తలకు ప్రస్తుతానికైతే ఎండ్ కార్డ్ పడినట్లయింది.