IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

Rajinikanth: ‘జైలర్ 2’ ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్.. మరోసారి ‘హుకుం’ రేంజ్‌లో రచ్చేనా?

Published August 19, 2026 · Updated August 19, 2026 · By Patricia Davis - indiabreakingdaily.com

Foto : Patricia Davis - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ రెడీ అవుతోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' రిలీజ్ సిద్ధమవుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. 'ది ఫీస్ట్ ఈజ్ రెడీ' అంటూ ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 21న ఈ సినిమా నుంచి తొలి పాట ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో రజినీ మేనియా మొదలైంది.

అసలు 'జైలర్' సినిమాకు మ్యూజిక్ ఎంతటి బలంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు, ముఖ్యంగా 'హుకుం', థియేటర్లలో రచ్చ రేపాయి. రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు అనిరుధ్ ఇచ్చిన మ్యూజికల్ ఎలివేషన్ సినిమాకు మరో స్థాయి హైప్ తీసుకొచ్చింది. ఇప్పుడు 'జైలర్ 2' కోసం కూడా అదే మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేయాలని అనిరుధ్ సిద్ధమవుతున్నాడు. ఫస్ట్ సింగిల్ కనుక 'హుకుం' రేంజ్‌లో పేలితే మాత్రం ఈ సీక్వెల్‌పై ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్

►ALSO READ | Vishwanath & Sons Box Office: 4 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్'!

ప్రస్తుతం 'జైలర్ 2' పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, నిర్మల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రజినీకాంత్‌తో పాటు రమ్యకృష్ణన్, యోగిబాబు, మీర్నా, రిత్కిక్ తమ మునుపటి పాత్రలను తిరిగి పోషిస్తున్నారు. ఇక ఎస్. జె. సూర్య, మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్, సూరజ్ వెంజరమూడు, అన్నా రాజన్ తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ విజువల్స్, నిర్మల్ పదునైన ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కలానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇక దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో ఇప్పటికే విపరీతమైన క్రేజ్ నెలకొంది. మరి ఆగస్టు 21న వినిపించబోయే ఆ 'ఫీస్ట్' ఎలా ఉండబోతుందో చూడాలి.

The Feast is ready!🪘💥 #Jailer2 First Single releasing on August 21 🔥 @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @vijaykartikdop @Nirmalcuts @ChethanDsouza @AlwaysJani @KiranDrk #PallaviSingh @valentino_suren #SantoshRaju @kabilanchelliah @RIAZtheboss #Jailer2FromOct15 pic.twitter.com/PKPNXvONXH

Related Reading

Frequently Asked Questions

What is Rajinikanth?

Rajinikanth is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does Rajinikanth matter?

Rajinikanth matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.