IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

Imran Khan: దేశ బహిష్కరణ నోటీసులపై బాంబే హైకోర్టుకు అమీర్ ఖాన్ మేనల్లుడు!

Published October 15, 2026 · Updated October 15, 2026 · By Thomas Martin - indiabreakingdaily.com

Foto : Thomas Martin - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌కు ఊహించని షాక్ తగిలింది. తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికా పౌరసత్వం కలిగి ఉండి, ఓసిఐ కార్డ్‌హోల్డర్‌గా భారత్‌లో నివసిస్తున్న 43 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్‌ను అక్టోబర్ 28లోగా భారత్ వదిలి వెళ్లిపోవాలని 'ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్' (FRRO) సంచలన నోటీసులు జారీ చేసింది.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ముంబైలో జరిగిన భారీ నిరసన ప్రదర్శనలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఆ సమయంలో ముంబై పోలీసులు ఆయన్ను అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే విదేశీ పౌరుడై ఉండి రాజకీయ నిరసనల్లో పాల్గొనడం 'ఫారినర్స్ యాక్ట్' నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనంటూ బిజెపి నేత కిరీట్ సోమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా స్పందించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇమ్రాన్ ఖాన్ కు దేశ బహిష్కరణ నోటీసులను జారీ చేశారు.

అయితే ఇమ్మిగ్రేషన్ అధికారులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ఎంజెడ్‌ఎమ్ లీగల్ క్రిమినల్ అడ్వకేట్ జుల్ఫికర్ మెమోన్ నేతృత్వంలోని న్యాయవాదుల బృందం ద్వారా ఆయన పిటిషన్ దాఖలు చేయనున్నారు. "ఓసిఐ కార్డ్‌హోల్డర్ నిరసనలలో పాల్గొనకూడదని ఏ చట్టంలోనూ స్పష్టమైన నిషేధం లేదు" అని ఆయన తరఫు న్యాయవాదులు వాదించనునన్నారు.. ఈ అత్యవసర పిటిషన్ త్వరలోనే చీఫ్ జస్టిస్ మహేష్ చంద్ర త్రిపాఠి, జస్టిస్ అద్వైత్ సేత్నా ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది.

►ALSO READ | Poonam Kaur : 'నీలో ఇక ఫన్ లేదు గురూజీ'.. త్రివిక్రమ్‌ను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ పోస్ట్!

ఒక్క నిరసన ప్రదర్శన ఒక బాలీవుడ్ హీరో జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పుతుందని ఎవరూ ఊహించలేదు. మరి బొంబాయి హైకోర్టు ఈ నోటీసులపై స్టే విధిస్తుందా? లేక ఇమ్రాన్ ఖాన్ నిజంగానే అక్టోబర్ 28 నాటికి భారత్‌ను వీడాల్సి వస్తుందా? అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తికరంగా మారింది.

Related Reading

Frequently Asked Questions

What is Imran Khan?

Imran Khan is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does Imran Khan matter?

Imran Khan matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.