IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

Health Alert: నిద్రకు ముందు ఫోన్ చూస్తున్నారా?.. ఈ నష్టాలు తప్పవంటున్న న్యూరాలజిస్టులు

Published September 27, 2026 · Updated September 27, 2026 · By Thomas Martin - indiabreakingdaily.com

Foto : Thomas Martin - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – చాలామందికి పడుకునే ముందు సెల్‌ఫోన్ చూడటం అలవాటుగా మారిపోయింది. కాసేపు సోషల్ మీడియా చూస్తామని ఫోన్ తీసుకున్నా.. వార్తలు, రీల్స్, వీడియోలు, నోటిఫికేషన్లతో గంటల తరబడి స్క్రోల్ చేస్తుంటారు. అయితే ఈ అలవాటు నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతుందని న్యూరాలజిస్టులు చెబుతున్నారు.

ముంబై జస్లోక్ హాస్పిటల్ న్యూరాలజీ డైరెక్టర్ డాక్టర్ జాయ్ డి. దేశాయ్ ప్రకారం.. రాత్రిపూట ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించడం వల్ల మెదడు చురుకుగానే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా, చిన్న వీడియోలు, వరుసగా వచ్చే కొత్త కంటెంట్ మెదడును నిరంతరం ఉత్తేజపరుస్తాయి. అలాంటి సందర్భంలో నిద్రకు భంగం కలుగుతుంది.

దీంతోపాటు ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే నీలి కాంతి శరీరంలోని మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ బ్యాలెన్స్ పై ప్రభావితం చేయొచ్చు. దీంతో నిద్ర పట్టేందుకు ఆలస్యం కావడం, నిద్రనాణ్యతలో తేడా వంటి సమస్యలు రావచ్చు.

ముఖ్యంగా నిద్రకు ముందు ప్రతికూల వార్తలను పదే పదే చూడటాన్ని డూమ్‌స్క్రోలింగ్ అంటారు. ఇది ఆందోళన, ఒత్తిడిని పెంచి మనసును నిద్రకు దూరం చేయవచ్చు.

నిద్ర శరీరానికి, మెదడుకు విశ్రాంతి మాత్రమే కాదు.. జ్ఞాపకశక్తి, భావోద్వేగ నియంత్రణ వంటి కీలక పనులకు కూడా అవసరం. అందుకే పడుకునే ముందు ఫోన్‌కు దూరంగా ఉండి ప్రశాంతమైన దినచర్యను పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Related Reading

Frequently Asked Questions

What is Health Alert?

Health Alert is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does Health Alert matter?

Health Alert matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.