Chennai Love Story Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’.. రెండు రోజుల్లోనే భారీ వసూళ్లు!

chennai-love-story-collections_xJWZy5kqjr

చెన్నై లవ్ స్టోరీ బాక్సాఫీస్‌లో సందడి: రెండు రోజుల్లోనే భారీ విజయం

Indiabreakingdaily.com – కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం కథ ప్రకారం, నివి అనే అమ్మాయి అజయ్‌ను (త్రిగుణ్) ప్రాణంగా ప్రేమిస్తుంది. పెళ్లి పీటలకు వచ్చేసరికి అజయ్ నివిని వదిలేసి వేరే అమ్మాయితో చెప్పాపెట్టకుండా వెళ్ళిపోతాడు. ఈ సంఘటనతో నివి తీవ్ర మనోవేదనకు గురవుతుంది. ఆ బాధ నుంచి బయటపడటానికి ఆమె స్నేహితులు చెన్నైకి తీసుకెళ్తారు. అక్కడే డైరెక్టర్ కావాలనే కలతో స్టీవెన్‌ శంకర్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు వస్తాడు.

అనుకోకుండా నివి జీవితంలోకి స్టీవెన్ ఎంట్రీ ఇస్తాడు. మొదట విభేదాలతో మొదలైన వారి పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న టైంలోనే వారి జీవితాలను మార్చేసే ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంటుంది. ఆ సంఘటన ఏమిటి? చివరికి వారి ప్రేమ కథ ఎలాంటి ముగింపుకు చేరుకుంది? అనేదే మిగతా కథ.

బాక్సాఫీస్ వసూళ్లు రికార్డు స్థాయిలో

సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద మంచి జోరు చూపిస్తోంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.13.2 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా, రెండో రోజు ఇండియాలో సుమారు రూ.2.82 కోట్ల నెట్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మొత్తంగా తొలి రెండు రోజుల్లో సినిమా రూ.10.45 కోట్ల ఇండియా నెట్, రూ.16.62 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ వసూలు చేసింది.

పెయిడ్ ప్రీమియర్స్ కలిపి మొత్తం రూ. 19.73 కోట్ల గ్రాస్ అందుకుంది. రెండో రోజు వసూళ్లు మొదటి రోజుతో పోలిస్తే 11% పెరగగా, వీకెండ్ ముగిసే నాటికి రూ. 30 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పాజిటివ్ టాక్, వీకెండ్ అడ్వాంటేజ్‌తో రెండో రోజు కూడా మంచి ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంటూ అలరిస్తుంది. సుమారు రూ.15 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం, ఇదే జోరు కొనసాగితే త్వరలోనే లాభాల్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, వీకెండ్ ముగిసే నాటికి రూ. 30 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *