AP Election 2026: ధర్మవరంలో ఉద్రిక్తత.. వైసీపీ కార్యకర్తలపై దాడి.. వీల్ చైర్ లో క్షతగాత్రులతో కేతిరెడ్డి ర్యాలీ..
Indiabreakingdaily.com – ఏపీలో స్థానిక ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. నామినేషన్ల పర్వం మొదలైన రోజునే రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ పై దాడి, రాయచోటిలో వైసీపీ పార్టీ ఆఫీసుపై దాడి ఘటనలతో అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. సత్యసాయి జిల్లా ధర్మవరంలో కూడా వైసీపీ, కూటమి నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో పలువురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడ్డ కార్యకర్తలను వీల్ చైర్ లో కూర్చోబెట్టి ర్యాలీ చేపట్టారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.
ఘర్షణలో గాయపడి, నడవలేని స్థితిలో ఉన్న వైసీపీ కార్యకర్తలను వీల్ చైర్లు, ట్రై సైకిళ్లపై కూర్చోబెట్టి నిరసన ర్యాలీగా ధర్మవరం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు కేతిరెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైసీపీ శ్రేణులపై దాడులకు తెగబడిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేతిరెడ్డి. కేతిరెడ్డి చేపట్టిన వీల్ చైర్ ర్యాలీ చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా.. పుంగనూరులో తన కాన్వాయ్ పై జరిగిన దాడికి స్పందిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఎంపీ మిథున్ రెడ్డి. కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుందని..అందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. దాడులకు భయపడేది లేదని.. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని..ఇవాళ దాడులు చేసినవారికి వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు మిథున్ రెడ్డి.
Related Reading
Frequently Asked Questions
What is AP Election 2026?AP Election 2026 is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does AP Election 2026 matter?AP Election 2026 matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.