IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

Allu Arjun: బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. హీరోయిన్, సాంగ్స్ లేకుండానే ‘AA23’.. అసలు లోకేష్ ప్లాన్ ఏంటి ?

Published July 28, 2026 · Updated July 28, 2026 · By Matthew Williams - indiabreakingdaily.com

Foto : Matthew Williams - indiabreakingdaily.com

AA23లో హీరోయిన్, పాటలు లేకుండా లోకేష్ ప్లాన్

Indiabreakingdaily.com – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'AA23' సినిమా గురించి ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే సంచలన అప్డేట్ వచ్చింది. సంక్రాంతి కానుకగా మైత్రీ మూవీ మేకర్స్ నుంచి విడుదలైన టీజర్‌లో చూపించిన ఎలిమెంట్స్ అభిమానులను ఆకర్షించాయి. అందులో అనిరుధ్ ఇచ్చిన థీమ్ సాంగ్ కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో 'AA23'లో పాటలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో అనేది అందరిలో ఆసక్తిని రేపింది.

అయితే, లేటెస్ట్‌గా వచ్చిన అప్డేట్ అభిమానులను షాక్‌లో పడేసింది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదని, అసలు మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్‌నే లేకుండా కథను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కథకు అవసరం లేని కమర్షియల్ అంశాలు, పాటలు లేదా బలవంతంగా హీరోయిన్ పాత్రను చేర్చే ఆలోచన లోకేష్‌కు లేదని సమాచారం.

లోకేష్ ఫార్ములా ఏంటి?

లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'AA23'పై ఆసక్తికర చర్చ సాగుతోంది. కమర్షియల్ ఫార్ములాలకు దూరంగా, డార్క్ అండ్ రా యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని లోకేష్ రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ కథకు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో కూడా కనెక్షన్ ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.

Lokesh Kanagaraj's #AA23 Formula Revealed! ?? "No Full-Fledged Heroine in #AA23 ?" ?? Director Lokesh Kanagaraj is reportedly sticking to his raw & intense #Kaithi & #Vikram style of storytelling! ?️? Where pure narrative and action take absolute priority over commercial…

గతంలో 'ఖైదీ', 'విక్రమ్' చిత్రాల్లో కూడా హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా కథ, యాక్షన్‌పైనే లోకేష్ దృష్టి పెట్టారు. అదే ఫార్మాట్‌ను 'AA23'లోనూ కొనసాగించనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. కొద్ది రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించనున్నారనే వార్తలు వినిపించినప్పటికీ, ఈ లేటెస్ట్ అప్డేట్ వాటికి భిన్నంగా ఉంది.

పాటల విషయంలో షాక్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటే అభిమానులకు ముందుగా గుర్తొచ్చేది ఆయన స్టైలిష్ డ్యాన్స్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, హుషారైన పాటలు. ముఖ్యంగా బన్నీ సినిమాల్లో సాంగ్స్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'AA23'లో మాత్రం పాటలకు పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చనే వార్త బన్నీ ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తుంది.

Wishing my hero @alluarjun sir a very happy birthday ?❤️ Super excited about the #AA23 #LK7 journey ahead with you sir ❤️ Can't wait to go on floors and make it an unforgettable one for both of us ?

లోకేష్ కనగరాజ్ తన సినిమాలను పూర్తిగా కథ, స్క్రీన్‌ప్లే, యాక్షన్ ఎలిమెంట్స్ చుట్టూ నడిపించే దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'ఖైదీ', 'విక్రమ్' వంటి చిత్రాల్లో కూడా ఆయన కమర్షియల్ అంశాల కంటే కథకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అదే తరహాలో 'AA23'ను కూడా డార్క్ అండ్ రా యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

కథ ఫ్లోకు ఆటంకం కలగకుండా ఉండేందుకు పాటలు, అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్‌ను తగ్గించాలని లోకేష్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అల్లు అర్జున్ అంటేనే డ్యాన్స్, సాంగ్స్‌ను ఇష్టపడే అభిమానులకు ఇది కొంత నిరాశ కలిగించే అంశంగా మారొచ్చు.

అయితే బన్నీ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, మాస్ ఎలివేషన్స్‌కు లోకేష్ ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. పాటలు లేకపోయినా, బన్నీ పాత్రను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసి అభిమానులను మెప్పించేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ తెరకెక్కిస్తున్న 'రాకా' చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షెడ్యూల్ పూర్తైన తర్వాత 'AA23' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.