82 మంది స్టూడెంట్స్కు అరగుండు …మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో అమానవీయ ఘటన
Indiabreakingdaily.com – చంద్రపూర్: మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ ఆదేశాలతో సుమారు 82 మంది విద్యార్థులకు అరగుండు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు జుట్టు కత్తిరించేందుకు పాఠశాల యాజమాన్యం శనివారం బార్బర్‌ను ఏర్పాటు చేసింది. ఆ సమయంలో కొందరు విద్యార్థులు లైన్లో లేకుండా ఆడుకోవడానికి వెళ్లారు. దీంతో ఆగ్రహించిన ప్రిన్సిపాల్.. సదరు స్టూడెంట్స్కు సగం జుట్టు మాత్రమే కత్తిరించాలని బార్బర్‌ను ఆదేశించినట్లు తెలిసింది.
ట్రిమ్మర్‌తో సగం జుట్టు కత్తిరించిన ఫొటోలు సోమవారం బయటకు వచ్చాయి. ఫొటోలు ఉన్నతాధికారులకు చేరడంతో వారి ఆదేశాల మేరకు అర్ధరాత్రి మిగతా జుట్టును తొలగించినట్టు తెలిసింది. అయితే అప్పటికే పిల్లల అరగుండు ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై స్కూల్ ప్రిన్సిపాల్‌తోపాటు సంబంధిత బాధ్యులకు ఉన్నతాధికారులు షోకాజ్‌నోటీసులు జారీ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం షోకాజ్ నోటీసుతో వ్యవహారాన్ని ముగించకుండా.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Related Reading
Frequently Asked Questions
What is 82 మ ద స ట డ ట?82 మ ద స ట డ ట is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does 82 మ ద స ట డ ట matter?82 మ ద స ట డ ట matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.