IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

14 ఏళ్ల పోరాటం.. BMW కార్ ఓనర్కు ఇన్సురెన్స్ కంపెనీ నుంచి రూ.70 లక్షలు

Published October 13, 2026 · Updated October 13, 2026 · By Matthew Brown - indiabreakingdaily.com

Foto : Matthew Brown - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – ఏదైనా ప్రమాదం జరిగింతే ఇన్సురెన్స్ కంపెనీలు బీమా చెల్లించే ముందు ఎన్ని మెలికలు పెడతాయో తెలిసే ఉంటుంది. దాదాపు క్లెయిమ్ నుంచి తప్పించేందుకు, బీమా అందకుండా చేసేందుకు దాదాపు ఉన్న అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పిన్ టు పిన్ చెక్ చేసి.. ఏదో ఒక చోట దొరక్క పోతారా అన్నట్లుగా వ్యవహరిస్తుంటాయి. ఈ బీఎండబ్ల్యూ కార్ ఓనర్ విషయంలో కూడా అలాగే చేసింది ఓ కంపెనీ. కానీ అలుపెరగని పోరాటం చేసి 14 ఏళ్ల తర్వాత గెలిచాడు.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ధుల్ఖేడ్ సమీపంలో స్టేట్ హైవేలో బీఎండబ్ల్యూ కారు టైరు పంక్చర్ అయిన ఘటనలో 14 ఏళ్ల పాటు కొనసాగింది పోరాటం. చివరకు కారు యజమాని రవికాంత్ ఎస్. పాటిల్‌కు విజయం దక్కింది. కన్జ్యూమర్ కమిషన్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని రూ.70 లక్షలకు పైగా చెల్లించాలని కన్జూమర్ కమిషన్ ఆదేశించింది.

2012 మార్చి 8న రాత్రి సమయంలో ఖాళీగా ఉన్న హైవేపై పాటిల్ బీఎండబ్ల్యూ కారులో వెళ్తుండగా టైరు పంక్చర్ అయింది. సమీపంలో మెకానిక్ ఎవరూ కనిపించకపోవడంతో ఆయన కారును రోడ్డు పక్కనున్న ధాబా దగ్గర పార్క్ చేసి డోర్లు లాక్ చేశారు. విండోస్‌ను కూడా జాగ్రత్తగా మూసేసి.. మరో వాహనంలో ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం కారు తీసుకోవాలని వచ్చినప్పుడు కారు పూర్తిగా కాలిపోయి బూడిదైపోయి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.

భీమా కంపెనీ మాత్రం క్లెయిమ్ చెల్లించడానికి నిరాకరించింది. కారును రాత్రంతా ఎవరూ చూడకుండా వదిలేయడం పాలసీ నిబంధనలకు విరుద్ధమని, కారును కాపాడుకునేందుకు, నష్టాన్ని నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని వాదించింది.

అయితే కన్జ్యూమర్ కమిషన్ ఈ వాదనను తోసిపుచ్చింది. పాలసీలో పాడైన వాహనాన్ని ఎవరూ చూడకుండా వదిలేయకూడదని పూర్తి నిషేధం లేదని పేర్కొంది. పాటిల్ కారును రోడ్డు నుంచి దూరంగా సురక్షితంగా పార్క్ చేసి, లాక్ చేసి భద్రపరచడం ద్వారా సహేతుకమైన జాగ్రత్తలు తీసుకున్నారని పేర్కొంది. కారు ఎవరూ చూడకుండా ఉండటం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని నిర్ధారించే ఆధారాలు లేవని కూడా చెప్పింది.

వాహనం కాపాడుకోవడం కోసం వ్యక్తిగత భద్రతను విస్మరించలేము కదా అని కమిషన్ ప్రశ్నించింది. అందుకే కారు ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ రూ.70 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అదనంగా మానసిక వేదన, వేధింపులకు రూ.50 వేలు, కేసు ఖర్చులకు రూ.25 వేలు కలిపి మొత్తం రూ.70.75 లక్షలు (వడ్డీ మినహా) చెల్లించాలని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో 14 ఏళ్ల న్యాయపోరాటం విజయవంతంగా ముగిసింది.

Related Reading

Frequently Asked Questions

What is 14 ఏళ ల ప ర ట BMW?

14 ఏళ ల ప ర ట BMW is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does 14 ఏళ ల ప ర ట BMW matter?

14 ఏళ ల ప ర ట BMW matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.