హాకీలో భారత అమ్మాయిల జోరు.. ఉజ్బెకిస్థాన్‌పై 19–0 ఘన విజయం!
Indiabreakingdaily.com – హ క ల భ రత అమ మ - Indian Hockey Team: జపాన్‌లోని గిఫు ప్రిఫెక్చురల్ గ్రీన్ స్టేడియంలో జరిగిన ఆసియా గేమ్స్ 2026 మహిళల హాకీ పూల్-బి తొలి మ్యాచ్‌లో భారత జట్టు మైండ్ బ్లాస్టింగ్ ప్రదర్శనతో బోణీ కొట్టింది. ఈరోజు (సెప్టెంబర్ 20న, ఆదివారం) ఉజ్బెకిస్థాన్‌తో జరిగిన వన్ సైడెడ్ మ్యాచ్‌లో ఏకంగా 19–0 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఇండియా యువ సంచలనం దీపికా ఏకంగా 8 గోల్స్‌తో గ్రౌండ్‌లో చెలరేగడంతో ఉజ్బెకిస్థాన్ జట్టు పూర్తిగా కొట్టుకుపోయింది.
మ్యాచ్ ప్రారంభం నుంచే భారత క్రీడాకారిణులు ఉజ్బెకిస్థాన్ గోల్ పోస్ట్‌పై విరుచుకుపడ్డారు. ఫస్ట్ హాఫ్‌లోనే హ్యాట్రిక్ సాధించిన దీపికా, భారత్‌ను 8–0 తేడాతో ఆధిక్యంలో నిలిపింది. సెకండ్ హాఫ్ ప్రారంభమయ్యాక కూడా తగ్గేదేలే అంటూ వరుసగా మరో 4 గోల్స్ కొట్టి టీమిండియా స్కోరును 13–0కి పెంచేసింది.
* మిగిలిన గోల్స్: దీపికా (8)తో పాటు ఇషికా 3 గోల్స్ చేయగా, లాల్తన్‌ట్లుయాంగి, నేహా చెరో రెండు గోల్స్ సాధించారు. బల్జీత్ కౌర్, నవ్‌నీత్ కౌర్, లాల్‌రెమ్‌సియామి, సాక్షి రాణాలు తలో గోల్ కొట్టి 19–0తో భారత్ ఆధిపత్యాన్ని పూర్తి చేశారు.
ఈ మ్యాచ్ భారత హాకీ దిగ్గజ గోల్ కీపర్ సవితా పునియా కెరీర్‌లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. సవితకు ఇది 320వ సీనియర్ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. దీంతో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన భారత మహిళా హాకీ ప్లేయర్‌గా వందనా కటారియా సరసన ఆల్ టైమ్ రికార్డును సమం చేసింది. అలాగే బల్జీత్ కౌర్ కూడా తన 50వ అంతర్జాతీయ మ్యాచ్ మైలురాయిని చేరుకుంది. భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌లో సోమవారం ( సెప్టెంబర్ 21న) ఇండోనేషియాతో తలపడనుంది.
సలీమా టేటె నాయకత్వంలోని భారత మహిళల జట్టు ఇటీవల ముగిసిన ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్ 2026లో 5వ స్థానంలో నిలిచి ఐదు దశాబ్దాల అత్యుత్తమ రికార్డు సాధించిన జోష్‌లో ఉంది. 2023 ఆసియా గేమ్స్‌లో సాధించిన కాంస్య పతకం కంటే మెరుగైన ప్రదర్శన చేస్తూ ఈసారి పసిడి పతకమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తుంది. ఆసియా గేమ్స్ ఛాంపియన్‌గా నిలిచే జట్టుకు నేరుగా లాస్ ఎంజెలిస్ ఒలింపిక్స్ 2028 (LA28) బెర్త్ ఖాయమవుతుంది.
INDIA THRASH UZBEKISTAN IN THE OPENING GAME AT ASIAN GAMES 2026! Our Women’s Hockey Team defeated Uzbekistan 🇺🇿 19-0 in first match of Pool B Deepika scored 8 Goals for India 🔥🔥🔥 pic.twitter.com/LdTPDk5ioD
Related Reading
Frequently Asked Questions
What is హ క ల భ రత అమ మ?హ క ల భ రత అమ మ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does హ క ల భ రత అమ మ matter?హ క ల భ రత అమ మ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.