సత్తుపల్లి సైబర్ నేరాలకు కేంద్రంగా మారుతోంది
తాజా అరెస్టుతో మళ్లీ చర్చలో సత్తుపల్లి
Indiabreakingdaily.com – స బర న రగ ళ లక అడ – హైదరాబాద్‌లో నమోదైన సైబర్ కేసులో కల్లూరు మండలం లింగాలకు చెందిన దేవరపల్లి పట్టాభిని అధికారులు అరెస్ట్ చేయడంతో సత్తుపల్లి పేరు మళ్లీ మారుమోగుతోంది. విదేశీయులను టార్గెట్ చేసి వివిధ రకాలుగా నమ్మించి డబ్బులు దోచుకున్నట్టు గతేడాది నవంబర్‌లో ఎఫ్ఐఆర్ 2934/2025తో రూ.90 కోట్ల విలువైన కేసు నమోదైంది. అప్పట్లో పోలీసులకు చిక్కకుండా విదేశాలకు పారిపోయిన పట్టాభి, ఇటీవల హైదరాబాద్ రావడంతో పట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అన్ని స్టేషన్లలోని సైబర్ కేసులను బదిలీ చేయగా వేర్వేరు కేసుల్లో పట్టాభిని కీలక నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు సమాచారం.
వెయ్యి కోట్లకు పైగా స్కామ్
ఈ ఏడాది జనవరిలో దాదాపు రూ.570 కోట్ల విలువైన స్కామ్‌లో సూత్రధారులు, పాత్రధారులందరూ సత్తుపల్లి నియోజకవర్గంలో బయటపడడం కలకలం రేపుతోంది. ఆ కేసును ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో స్కామ్ విలువ రూ.వెయ్యి కోట్లకు మించడంతో పోలీస్ అధికారులే ముక్కున వేలేసుకున్నారు. బాధితులు మాత్రం పదుల సంఖ్యలో దేశాలకు చెందిన వారున్నారు.
జనవరిలో బయటపడిన స్కామ్‌లో పోట్రు మనోజ్ కల్యాణ్, ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు ప్రవీణ్, మేడా భానుప్రియ, మేడా సతీశ్, మోరంపూడి చెన్నకేశవ సహా ప్రధాన నిందితుల బ్యాంక్ అకౌంట్లలో ట్రాన్సాక్షన్స్ విలువే రూ.570 కోట్లు దాటింది.
మోసం విధానాలు మరియు కాల్ సెంటర్లు
సత్తుపల్లిలో బయటపడుతున్న సైబర్ ఫ్రాడ్ కేసుల్లో నిందితులు వేరైనా, మోసం చేసే విధానం మాత్రం దాదాపు ఒకేలా ఉంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు కంబోడియా వంటి దేశాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేయడం, కొందరిని ఉద్యోగులుగా నియమించుకొని వేరే దేశాలకు చెందిన వారిని ఫోన్ కాల్స్ ద్వారా ట్రాప్ చేయడం కామన్‌గా కనిపిస్తోంది.
మ్యాట్రిమోనీ, రివార్డు పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్.. ఇలాంటి వేర్వేరు టాపిక్లతో అమాయకులకు ఫోన్ కాల్స్ చేసి ట్రాప్ చేయడం, వారిని టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చి పెట్టుబడుల పేరుతో డబ్బులు రాబట్టడం, మోసపూరిత లింకులు, ఏపీకే ఫైల్స్ ద్వారా వారి బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేసేవారు.
సొమ్ము బదిలీ మరియు అరెస్టులు
వాటిని తెలిసిన వారి మ్యూల్ అకౌంట్ల ద్వారా సొంత కరెంట్ అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేయడం, మళ్లీ తిరిగి వాటిని కంబోడియా ఏజెంట్లు, చైనా ఏజెంట్ల ద్వారా యూఎస్ డాలర్, క్రిప్టో కరెన్సీలోకి మార్చినట్టు పోలీస్ అధికారుల ఎంక్వైరీలో తేలింది.
ఈ నిందితులు వాడిన బ్యాంక్ అకౌంట్లను నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో పరిశీలిస్తే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో సైబర్ క్రైమ్ ఫిర్యాదులున్నట్టు బయటపడింది. సత్తుపల్లి రూరల్, పెనుబల్లి పోలీస్స్టేషన్లలో రిపోర్ట్ అయిన కేసుల్లో నిందితులకు సహకరించిన ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది ముగ్గురితో పాటు 55 మందిని అరెస్ట్ చేశారు.
విలాసవంతమైన జీవితం
ఈ నిందితులంతా స్కామ్‌ల ద్వారా కొల్లగొట్టిన రూ.వందల కోట్ల సొమ్ముతో గత కొన్నేళ్లుగా సత్తుపల్లితో పాటు హైదరాబాద్‌లో హల్ చల్ చేస్తున్నారు. ప్రైవేట్ జెట్ విమానాల్లో ప్రయాణాలు, లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం, కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో వందల ఎకరాలను కొనుగోలు చేయడం, రేంజ్ రోవర్, బెంజ్ కార్లలో తిరగడం, సొంతూరికి వస్తే బౌన్సర్లను ఏర్పాటు చేసుకోవడం వంటి జల్సాలు చేశారు.
సర్పంచ్ ఎన్నికల్లోనూ డబ్బు కుమ్మరించారు. లింగాలలో పట్టాభి తండ్రి సర్పంచ్‌గా పోటీ చేయగా ఆ ఎన్నికల కోసం రూ.3 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.
కొత్తగా ఎంటర్ అవుతున్న వారు
గత కొన్నేళ్లుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న నిందితులు, వాళ్ల విలాసాలు చూసి కొత్తగా మరికొంత మంది ఇలాంటి దందాల్లోకి ఎంటర్ అవుతున్నారు. సులువుగా వందల కోట్లు సంపాదించి ఎంజాయ్ చేయొచ్చనే భావనతో ఉంటున్నారు.
హైదరాబాద్‌లో హానర్ హోమ్స్ కంపెనీ ఎండీ ఫొటోను వాడుకొని, ఆ సంస్థ ఉద్యోగిని మోసం చేసి రూ.4.70 కోట్లు కొల్లగొట్టారు. ఈ కేసులో గత నెలలో సత్తుపల్లికి చెందిన మండపల్లి శివనాగరాజు, దోసపాటి కృష్ణసాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా ఒకరిని చూసి మరొకరు సైబర్ ఫ్రాడ్ కు పాల్పడుతుండడంతో కొత్తగా మరెవరి పేరు బయటకు వస్తుందన్న చర్చ జరుగుతోంది.
Related Reading
Frequently Asked Questions
What is స బర న రగ ళ లక అడ?
స బర న రగ ళ లక అడ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does స బర న రగ ళ లక అడ matter?
స బర న రగ ళ లక అడ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.



