ఒరాకిల్‌లో మళ్లీ లేఆఫ్స్ సాధ్యం.. సెప్టెంబర్‌కు ముందు ప్రకటన?
Indiabreakingdaily.com – స ప ట బర ల మర ర – టెక్నాలజీ రంగంలో అగ్రగామి సంస్థలలో ఒకటైన ఒరాకిల్‌లో ఉద్యోగుల తొలగింపుల విషయం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. గతేడాది మార్చి నాటికి ప్రపంచవ్యాప్తంగా 21వేల మందికి పైగా ఉద్యోగులను కంపెనీ విడుదల చేసింది. ఇప్పుడు మరోసారి లేఆఫ్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి.
సెప్టెంబర్ 1న ప్రారంభమయ్యే రెండో త్రైమాసికానికి ముందే ప్రభావిత ఉద్యోగులకు సమాచారం అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సారి ఎంత మంది ఉద్యోగులు ఇళ్లకు పంపబడతారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
మేనేజర్లకు కొత్త బాధ్యతలు
ఒరాకిల్ లోని మేనేజర్లను మళ్లీ తొలగింపులకు గురయ్యే ఉద్యోగుల జాబితా సిద్ధం చేయాలని కోరినట్లు సమాచారం. కొన్ని టీమ్‌లలో ఉద్యోగుల సంఖ్యను రెండంకెల శాతంలో తగ్గించే అవకాశం ఉందని అంటున్నారు.
మార్చిలో జరిగిన తొలగింపులతో కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యలో సుమారు 13 శాతం తగ్గించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్షా 41వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈసారి లేఆఫ్స్ చేపడితే ఈ సంఖ్య భారీగా తగ్గనుందని తెలుస్తోంది.
ఖర్చుల నియంత్రణే ప్రధాన కారణం
ఒరాకిల్ లేఆఫ్స్ వెనుక ప్రధాన కారణంగా ఏఐ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పెరుగుతున్న ఖర్చులు కనిపిస్తున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సుమారు 55 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇందులో AI మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన వ్యయాలు కీలకంగా ఉన్నాయి.
ఇదే సమయంలో సంస్థ సుమారు 43 బిలియన్ డాలర్లను డెట్, ఈక్విటీ మార్గాల్లో సమీకరించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. భారీ పెట్టుబడుల నేపథ్యంలో ఖర్చులను నియంత్రించేందుకు ఉద్యోగుల తొలగింపులను సంస్థ ఒక మార్గంగా చూడటం టెక్కీలకు నిద్రలేకుండా చేస్తోంది ప్రపంచ వ్యాప్తంగా.
ఒరాకిల్ పునర్వ్యవస్థీకరణపై కూడా భారీగా ఖర్చు చేస్తోంది. కంపెనీ ఇటీవల సమర్పించిన ఫైలింగ్ ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల తొలగింపులు, సెవెరెన్స్, ఇతర రీస్ట్రక్చరింగ్ ఖర్చుల కోసం రూ.17వేల 500 కోట్లకు పైగానే వెచ్చించింది.
AIపై భారీ పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి, మరోవైపు ఖర్చులను తగ్గించాల్సిన అవసరం..ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించే ప్రయత్నం చేస్తోంది టెక్ దిగ్గజం. అయితే తాజా లేఆఫ్స్‌పై ప్రస్తుతానికి కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Related Reading
Frequently Asked Questions
What is స ప ట బర ల మర ర?
స ప ట బర ల మర ర is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does స ప ట బర ల మర ర matter?
స ప ట బర ల మర ర matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.



