IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

శివుడి ఆశీస్సుల కోసం ఆది కైలాసం చేరుకున్న పంత్.. ప్రత్యేక పూజలు చేసిన స్టార్ క్రికెటర్

Published June 16, 2026 · Updated July 21, 2026 · By Robert Anderson - indiabreakingdaily.com

Foto : Robert Anderson - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – శ వ డ ఆశ స స ల - Rishabh Pant: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) ప్రస్తుతం గ్రౌండ్‌లోనే కాదు, ఒక డిఫరెంట్ విషయంతో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాడు. జూన్ 13, శనివారం నాడు ఎవరికీ చెప్పకుండా ఉత్తరాఖండ్‌లోని అత్యంత పవిత్రమైన ఆది కైలాష్, ఓం పర్వత్ పుణ్యక్షేత్రాలను పంత్ సందర్శించాడు. ఎంత రహస్యంగా ఈ టూర్ ప్లాన్ చేశాడంటే.. స్థానిక అధికారులకు గానీ, పబ్లిక్‌కు గానీ పంత్ వస్తున్నాడనే ముచ్చట అస్సలు తెలియనే లేదు.

గుట్టుగా సాగిన ప్రయాణం: లార్డ్ శివ భక్తులకు ఎంతో పరమ పవిత్రమైన హిమాలయాల కుమాన్ ప్రాంతంలోని ఇండో-నేపాల్ సరిహద్దుకు దగ్గరగా ఉండే ఆది కైలాష్ ప్రాంతానికి స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ చేరుకున్నాడు. అక్కడ శివుడికి ప్రత్యేక పూజలు చేశాడు. ఆ తర్వాత అద్భుతమైన ఓం పర్వత్‌ను దర్శించుకుని, ఆ పవిత్రమైన ప్రశాంత వాతావరణంలో కొద్దిసేపు గడిపాడు. ఈ కొండల ప్రయాణం ముగిశాక, వ్యాస్ వ్యాలీలోని ‘నబి’ (Nabi) అనే చిన్న గ్రామానికి చేరుకుని, ఆ రాత్రికి అక్కడి ఒక లోకల్ హోమ్‌స్టేలోనే బస చేశాడు.

దారిలో పంత్ కార్ పంచర్: ఆది కైలాష్ పర్యటనలో భాగంగా గుంజి ప్రాంతం (Gunji region) దగ్గరకు రాగానే రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న వాహనం టైర్ పంచర్ అయింది. ఏం చేయాలో పాలుపోని సమయంలో, అక్కడ డ్యూటీలో ఉన్న ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) బలగాలు పంత్‌కు వెంటనే హెల్ప్ చేశాయి. ఇక కార్ రిపేర్ అయ్యేలోపు అక్కడే ఉన్న ఇండియన్ ఆర్మీ జవాన్లతో పంత్ చాలా సరదాగా టైమ్ స్పెండ్ చేశాడు. మన సైనికులతో కలిసి ముచ్చట్లు పెడుతూ, వారితో పాటే బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయడం విశేషం.

ఓం నమః శివాయ అంటూ పంత్ ట్వీట్: ఈ టూర్ అంతా అయిపోయాక, తన ఆధ్యాత్మిక ప్రయాణానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను రిషభ్ పంత్ ఎక్స్ (X) ప్లాట్‌ఫారమ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫోటోలలో పంత్ హిమాలయాల మంచు కొండల మధ్య దేవుడికి నమస్కరిస్తూ కనిపించాడు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. ఓం నమః శివాయ, ఉత్తరాఖండ్‌లో ఏదో ఒక ప్రత్యేకమైన అనుభూతి ఖచ్చితంగా దాగి ఉందని క్యాప్షన్‌ పెట్టాడు.

ॐ नमः शिवाय ??️??? There’s something truly special about our Uttarakhand. ?️✨ pic.twitter.com/NUDshTt8Uh

Watch | Indian cricketer Rishabh Pant shared a video and wrote, "There’s something truly special about our Uttarakhand." @RishabhPant17 | @DIPR_UK | #RishabhPant | #Uttarakhand | #IndianCricket | #TeamIndia | #SocialMedia | #ViralVideo | #IncredibleIndia | #UNI pic.twitter.com/VhyAUKaKSB

भारतीय क्रिकेट टीम के स्टार विकेटकीपर-बल्लेबाज ऋषभ पंत ने उत्तराखंड के पवित्र आदि कैलाश और ओम पर्वत के दर्शन कर पूजा-अर्चना की। यात्रा के दौरान गुंजी में वाहन का टायर खराब होने पर आईटीबीपी जवानों ने उनकी मदद की... #RishabhPant #AdiKailash #Uttarakhand pic.twitter.com/meG3NUjHgj