IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది.. కూటమి హయాంలో పదివేల మందిని తొలగించారు: వైఎస్ జగన్

Published June 10, 2026 · Updated July 21, 2026 · By Thomas Martin - indiabreakingdaily.com

Foto : Thomas Martin - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – వ జ గ స ట ల ప - వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంలో 9 మంది మృతి చెందగా... ఐదుగురు తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. బుధవారం ( జూన్ 10 ) స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వైజాగ్ వెళ్లారు జగన్. వైజాగ్ లోని సెవెన్ హిల్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు జగన్. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి సర్కార్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు జగన్. కూటమి హయాంలో స్టీల్ ప్లాంట్ లో పదివేల మంది ఉద్యోగులను తొలగించారని.. ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు.

స్టీల్ ప్లాంట్ ఘటన బాధాకరమని... ఉక్కు కార్మికుల పరిస్థితి గురించి అందరు ఆలోచించాలని అన్నారు జగన్. వైసీపీ హయాంలో కార్మికుల పరిస్థితి ఎలా ఉండేది.. కూటమి హయాంలో ఎలా ఉందో అందరు గమనించాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ అడ్డుకుందని.. 2021 మర్చి 9న ప్రధాని మోడీకి లేఖ కూడా రాశామని..ప్రైవేటీకరణ జరగకూడదని గట్టిగా చెప్పామని అన్నారు జగన్.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవత్వంతో ప్రవర్తించాలని...స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని మోదీకి రెండు లేఖలు రాశామని అన్నారు. ప్రైవేటీకరణ వద్దని అసెంబ్లీలో కూడా తీర్మానం చేశామని...ప్రైవేటీకరణను ఆపి కార్మికులకు అండగా నిలిచామని అన్నారు. కార్మికుల కోసం గట్టిగా పోరాడామని.. వైసీపీ ప్రభుత్వం దిగిపోయేసరికి 28 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని... కూటమి ప్రభుత్వ రెండేళ్ల కాలంలో పదివేల 500 మందిని తొలగించారని అన్నారు జగన్.

కూటమి ప్రభుత్వంలో 6వేల 500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని.. వీఆర్ పేరుతో 1800 మందిపై ఒత్తిడి చేసి తప్పించారని.. మరో 2000 మంది ఉద్యోగులను కూడా తొలగించారని మండిపడ్డారు జగన్. ఉద్యోగుల సంఖ్యను 16 వేలకు కుదించారని అన్నారు. ఉద్యోగుల జీతాలు నాలుగు నెలలు బకాయి పెట్టారని అన్నారు. ఉద్యోగుల జీతాలకు ప్రొడక్షన్ తో లింక్ పెట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని..నిన్న లోకేష్ మాటలు చూస్తే ఆశ్చర్యం వేసిందని అన్నారు. లోకేష్ లాంటి మనుషులు క్కూడా ఉంటారా అనిపించిందని అన్నారు.

బాధితులకు ప్రభుత్వం తరఫున ఏం చేస్తున్నారో చెప్పలేదని.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదుని అన్నారు. బాధితులకు రూ.1.72 కోట్లు మీరు ఇచ్చేదేంటని అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇలాంటి ఘటనే జరిగినప్పుడు మేము వెంటనే స్పందించామని.. ఘటనా స్థలానికి వచ్చి రూ. కోటి పరిహారం ప్రకటించామని అన్నారు. బాధిత కుటుంబాలకు అప్పట్లో వైఎస్సార్సీపీ తోడుగా ఉందని... కానీ, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం స్పందిస్తున్న తీరు అన్యాయంగా ఉందని అన్నారు.బాధితులకు రావాల్సినవి రాకుండా చేస్తున్నారని అన్నారు.

బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని.. రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు జగన్. చంద్రబాబు ప్రభుత్వం కానీ పరిహారం ఇవ్వకపోతే.. వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ. కోటి పరిహారం ఇస్తామని అన్నారు జగన్.