IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

విదేశాలకు వెళ్తున్నారా ? ఇక అంత ఈజీ కాదు.. 2026లో వీసా రూల్స్ మార్చిన 4 దేశాలు ఇవే !

Published August 3, 2026 · Updated August 3, 2026 · By Michael Garcia - indiabreakingdaily.com

Foto : Michael Garcia - indiabreakingdaily.com

2026లో భారతీయుల విదేశీ ప్రయాణాలకు కొత్త నిబంధనలు

Indiabreakingdaily.com – వ ద శ లక వ ళ త - మీరు ఈ సంవత్సరం విదేశాలకు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే టికెట్లు బుక్ చేసుకోవడం ముందు కొన్ని ముఖ్యమైన మార్పులు తెలుసుకోవడం అవసరం. గతంలో సులభంగా వెళ్లొచ్చిన కొన్ని దేశాలు ఇప్పుడు వీసా నిబంధనలను మార్చేశాయి. బొలీవియా, కేప్ వెర్డే, నికరాగ్వా, ఇరాన్ అనే నాలుగు దేశాలు 2026 సంవత్సరంలో వీసా పద్ధతులలో మార్పులు తెచ్చాయి.

కొన్ని దేశాలు వీసా-ఫ్రీ ట్రావెల్‌ను రద్దు చేయగా, మరికొన్ని 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యాన్ని తొలగించాయి. దీని అర్థం ఇకపై విదేశాలకు వెళ్లే ముందే వీసా పొందడం తప్పనిసరి అవుతుంది.

బొలీవియా: ఇ-వీసా విధానం ప్రారంభం

బొలీవియా విమానాశ్రయంలో వీసా పొందే అవకాశం ఇకపై లేదు. దీనికి బదులుగా దేశం ఇ-వీసా వ్యవస్థను పరిచయం చేసింది. ప్రయాణికులు బొలీవియా వెళ్లే ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అనుమతి వచ్చిన తర్వాతే ప్రయాణం ప్రారంభించాలి.

కేప్ వెర్డే: వీసా-ఆన్-అరైవల్ నిలిపివేత

అందమైన సముద్ర తీరాలకు ప్రసిద్ధి చెందిన కేప్ వెర్డే.. భారత్‌తో సహా 96 దేశాలకు ఇస్తున్న వీసా-ఆన్-అరైవల్ సౌకర్యాన్ని జనవరి 1, 2026 నుండి నిలిపివేసింది. గతంలో అక్కడికి వెళ్లిన తర్వాత ఫీజు చెల్లించి వీసా తీసుకునేవారు. కానీ ఇప్పుడు ముందుగానే వీసా పొందాలి. లేకుంటే విమానాశ్రయంలో ఎంట్రీ నిరాకరిస్తారు.

నికరాగ్వా: ముందస్తు అనుమతి అవసరం

భారతీయుల కోసం నికరాగ్వా పెద్ద మార్పు చేసింది. ఫిబ్రవరి 16 నుండి వీసా ఆన్ అరైవల్ రద్దు చేసింది. దీనిని 'కన్సల్టెడ్ వీసా' కేటగిరీ కింద మార్చారు. విమానం ఎక్కే ముందే నికరాగ్వా ఇమ్మిగ్రేషన్ అధికారుల నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఈ అనుమతి లేకపోతే ఎయిర్‌లైన్స్ వారు మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కనివ్వరు.

ఇరాన్: వీసా ఫ్రీ ఎంట్రీ రద్దు

గతంలో భారతీయులు ఇరాన్‌కు వెళ్లడానికి వీసా అవసరం ఉండేది కాదు. కానీ, ఇరాన్ ప్రభుత్వం వీసా మినహాయింపును నిలిపివేసింది. దీనివల్ల ఇప్పుడు భారతీయులు ఇరాన్ వెళ్లాలన్నా కచ్చితంగా ముందుగానే వీసా పొందాలి.

విదేశాలకు వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

మీరు వెళ్లే దేశం అధికారిక ఎంబసీ లేదా ఇమ్మిగ్రేషన్ వెబ్‌సైట్‌లో కొత్త వీసా రూల్స్‌ను పరిశీలించండి. ఇ-వీసా లేదా ముందస్తు అనుమతి కావాలంటే చివరి నిమిషం వరకు ఆగకుండా చాలా ముందే దరఖాస్తు చేసుకోండి. వీసా డాక్యుమెంట్లకు సంబంధించి డిజిటల్ కాపీలతో పాటు ప్రింటెడ్ కాపీలను కూడా మీ వెంట ఉంచుకోండి. మీరు ప్రయాణించే విమానయాన సంస్థ (ఎయిర్‌లైన్స్) నిబంధనలను కూడా ఒకసారి చెక్ చూసుకోండి, ఎందుకంటే వారు వీసా సరిగ్గా ఉంటేనే బోర్డింగ్ అనుమతిస్తారు.

Related Reading

Frequently Asked Questions

What is వ ద శ లక వ ళ త?

వ ద శ లక వ ళ త is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does వ ద శ లక వ ళ త matter?

వ ద శ లక వ ళ త matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.