IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

లంచ్ బ్రేక్ 30 నిమిషాలు.. ఒక్క నిమిషం లేట్ అయినా గంట ఎక్స్ట్రా వర్క్.. ఆ గంటకి జీతం కట్ !

Published June 23, 2026 · Updated July 21, 2026 · By Patricia Davis - indiabreakingdaily.com

Foto : Patricia Davis - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – లంచ్ బ్రేక్‌లో త్వరగా తినండి.. ఒక్క నిమిషం ఆలస్యం అయినా.. ఆలస్యం అయిన ఒక్కో నిమిషానికి ఒక గంట అదనంగా పనిచేయాల్సి ఉంటుందని.. అదనంగా పనిచేసినందుకు ఒక్క రూపాయి కూడా జీతం చెల్లించడం జరగదని ఒక కంపెనీ అంటించిన నోటీస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నోటీస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నోటీసుపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఏ కంపెనీలో ఈ నోటీస్ అంటించారో స్పష్టత లేనప్పటికీ.. ఆ నోటీసులోని మరో అంశం ఉద్యోగులను కలవరపాటుకు గురిచేసింది.

If your management writes policies like this, don't be surprised when your best employees write resignation emails. pic.twitter.com/3v5jZGA3XS

భోజనానికి వెళ్లిన ఉద్యోగి 30 నిమిషాలకు ఒక్క నిమిషం ఎక్కువగా సమయం గడిపాడనుకుంటే.. ఆ ఒక్క నిమిషం ఆలస్యం అయినందుకు.. సదరు ఉద్యోగి సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోవడానికి బదులుగా, రాత్రి 7 గంటల వరకు ఆఫీస్‌లోనే ఉండి పనిచేయాల్సి ఉంటుంది. ఆ గంట పాటు చేసే పనికి ఆ కంపెనీ పైసా కూడా చెల్లించదు. ఈ నోటీసుపై నెటిజన్లు తమ ఉద్యోగ అనుభవాలను, తమ ఆఫీస్‌ల్లో ఎదుర్కొన్న పరిస్థితులను ప్రస్తావించారు.

"నేను పనిచేసిన కంపెనీలో, ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా 30 నిమిషాల జీతం కోత విధించేవారు," అని ఒక నెటిజన్ చెప్పుకొచ్చారు. "ప్రతి నిమిషాన్ని లెక్కించే బదులు, ఉద్యోగి సామర్థ్యాన్ని లెక్కించడానికి ప్రయత్నించండి. కంపెనీలు ప్రతీ చిన్న విషయాన్ని పర్యవేక్షించడానికే ఎందుకు ఇంతగా ఇష్టపడతాయో నాకు అర్థం కావడం లేదు. కేవలం ఆఫీసు పనివేళలను నింపడం, కుర్చీలను వేడి చేయడం కాదు, పనిని సమర్థవంతంగా పూర్తి చేయడమే ముఖ్యం," అని మరో నెటిజన్ సదరు ఆఫీస్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టాడు.

భారతీయ కంపెనీల యజమానులలో ఉండే ఇలాంటి వెనుకబడిన మనస్తత్వాల వల్లే వారు అంతర్జాతీయ స్థాయికి ఎదగలేకపోతున్నారు. భారతదేశంలో కార్మికుల దోపిడీ సర్వ సాధారణం అయిపోయింది. ఏదో ఒక సాకు చూపించి ఉద్యోగులకు అందే అరకొర జీతాల్లో కూడా కోత విధిస్తున్నారు. అందుకే భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయింది’’ అని మరొక నెటిజన్ అభిప్రాయపడ్డాడు. "ఒక్క నిమిషం ఆలస్యమైతే అదనంగా 60 నిమిషాలు పని చేయాలా? వీడు నడుపుతున్నది ఆఫీస్ కాదు, ఒక కార్పొరేట్ జైలు," అని ఒక నెటిజన్ ఒకింత ఘాటుగా బదులిచ్చాడు.