IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

రొటీన్ క్లీనింగ్, రిపేర్ల కోసం ఓనర్లు అడ్వాన్స్ డబ్బు కట్ చేయెుచ్చా.. చట్టం ఏం చెబుతోంది?

Published August 7, 2026 · Updated August 7, 2026 · By Robert Anderson - indiabreakingdaily.com

Foto : Robert Anderson - indiabreakingdaily.com

అద్దె ఇంటి ఖాళీ చేసేటప్పుడు డిపాజిట్‌లో కోతలు: చట్టపరమైన వివరాలు

Indiabreakingdaily.com – ర ట న క ల న గ - అద్దె ఇంటి ఖాళీ చేసేటప్పుడు యజమానులు సెక్యూరిటీ డిపాజిట్‌లో నుంచి కొంత మొత్తం కట్ చేయడం చాలా సాధారణం. ముఖ్యంగా పెయింటింగ్, వైట్‌వాష్, క్లీనింగ్ ఖర్చుల పేరుతో డబ్బు మినహాయించడం వల్ల అద్దెదారులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అయితే భారత చట్టాలు, కోర్టుల తీర్పుల ప్రకారం సాధారణంగా గోడల రంగు వెలిసిపోవడం, చిన్నపాటి మరకలు, ఇంటికి ఉండే సహజ అరుగుదల వంటి కారణాలతో సెక్యూరిటీ డిపాజిట్‌ను కట్ చేయడం చెల్లదు. ఇవి ఇంటి యజమాని భరించాల్సిన మెయింటెనెన్స్ ఖర్చులుగా పరిగణిస్తారు.

చట్టపరమైన నిబంధనలు మరియు కోర్టు తీర్పులు

ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, 1882లోని సెక్షన్ 108(m) ప్రకారం అద్దెదారు ఇంటిని జాగ్రత్తగా ఉపయోగించాలి. అద్దె గడువు ముగిసిన తర్వాత ఇంటిని తాను తీసుకున్న సమయంలో ఉన్న స్థితికి దగ్గరగా అప్పగించాల్సి ఉంటుంది.

సాధారణంగా గోడల రంగు మసకబారడం, రోజువారీ వినియోగం వల్ల వచ్చే చిన్నపాటి మార్పులు, మళ్లీ పెయింటింగ్ చేయాల్సిన అవసరం వంటి ఖర్చులను అద్దెకు ఉన్న వ్యక్తులపై ఓనర్స్ మోపలేరు.

ఢిల్లీ హైకోర్టు తీర్పులను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం ఈ నిబంధనలు వర్తిస్తాయి. కానీ అద్దెదారు నిర్లక్ష్యం వల్ల గోడలకు పెద్ద నష్టం, ఫిట్టింగ్‌లు పగలడం, తలుపులు కిటికీలు దెబ్బతినడం వంటి నష్టం జరిగితే మాత్రం యజమాని డిపాజిట్‌లో నుంచి రిపేర్ల కోసం తగిన మొత్తం మినహాయించేందుకు హక్కు ఉంటుంది.

రెంటల్ అగ్రిమెంట్ యొక్క ప్రాముఖ్యత

ఇలాంటి సందర్భాల్లో రెంటల్ అగ్రిమెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. డిపాజిట్ నుంచి ఎలాంటి ఖర్చులు మినహాయించవచ్చో ఒప్పందంలో స్పష్టంగా ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఆ నిబంధనలు కూడా చట్టానికి విరుద్ధంగా ఉండకూడదు.

ఇంటి యజమాని డబ్బు కట్ చేయాలంటే నిజంగా జరిగిన నష్టానికి సంబంధించిన ఆధారాలు, మరమ్మతుల ఖర్చు వివరాలు చూపించాల్సి ఉంటుంది. కేవలం పెయింటింగ్ చేయించాం, క్లీనింగ్ చేశాం అని చెప్పి ఏకపక్షంగా డబ్బు కట్ చేయడం సరైన పద్ధతి కాదని చట్టం చెబుతోంది.

అద్దెదారులు పాటించాల్సిన జాగ్రత్తలు

అద్దె ఇల్లు ఖాళీ చేసే ముందు ఇంటి పరిస్థితిని ఫోటోలు, వీడియోల రూపంలో రికార్డ్ చేసుకోవడం, అలాగే రెంటల్ అగ్రిమెంట్ కాపీని భద్రంగా ఉంచుకోవడం మంచిది. ఒకవేళ ఇంటి యజమాని సాధారణ మెయింటెనెన్స్ అండ్ క్లీనింగ్ పేరుతో డిపాజిట్‌లో కోత విధిస్తే.. ఆ ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలు, బిల్లులు ఇవ్వాలని అడిగే హక్కు అద్దెదారుకు ఉంది.

సరైన ఆధారాలు లేకుండా డిపాజిట్‌ను నిలిపివేస్తే.. చట్టపరంగా కూడా దానిని సవాలు చేసే అవకాశం వారికి ఉంటుంది. సొల్లు కబుర్లు చెప్పి ఇంట్లో అద్దెకు దిగిన ఫ్యామిలీ ఇచ్చే అడ్వాన్స్ డబ్బులు కాజేద్ధాం అనుకునే ఓనర్లకు చట్టం ఏం చెబుతోందో గుర్తుచేస్తే అద్దెదారు సేఫ్ అన్నమాట.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: అద్దెదారు పెయింటింగ్ ఖర్చులు చెల్లించాలా? సాధారణ పెయింటింగ్ ఖర్చులు యజమాని భరించాలి. అద్దెదారు నిర్లక్ష్యం వల్ల గోడలకు నష్టం జరిగితే మాత్రమే అతను ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రశ్న: డిపాజిట్‌లో నుంచి ఎంత మొత్తం కట్ చేయవచ్చు? నిజంగా జరిగిన నష్టానికి సంబంధించిన ఆధారాలు, మరమ్మతుల ఖర్చు వివరాలు చూపించిన తర్వాత మాత్రమే డిపాజిట్‌లో నుంచి మొత్తం మినహాయించవచ్చు.

ప్రశ్న: అద్దెదారు డిపాజిట్ తిరిగి పొందడానికి ఏం చేయాలి? సరైన ఆధారాలు, బిల్లులు అడిగి, చట్టపరంగా సవాలు చేసే హక్కు ఉపయోగించాలి. అవసరమైతే లీగల్ నోటిస్ పంపవచ్చు.

Related Reading

Frequently Asked Questions

What is ర ట న క ల న గ?

ర ట న క ల న గ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does ర ట న క ల న గ matter?

ర ట న క ల న గ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.