IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

రూపాయి ఖర్చు లేని హెల్త్ సీక్రెట్: రాత్రి తిన్న తర్వాత కాసేపు నడవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే..

Published July 16, 2026 · Updated July 21, 2026 · By Thomas Martin - indiabreakingdaily.com

Foto : Thomas Martin - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – ర ప య ఖర చ ల న - చాలా మంది కడుపు, జీర్ణ వ్యవస్థ సమస్యల కోసం ఖరీదైన మందులు, డిటాక్స్ డ్రింక్స్ వాడుతుంటారు. కానీ, ప్రముఖ జీర్ణకోశ నిపుణుల ప్రకారం... వాటన్నింటికంటే సులభమైన, అద్భుతమైన అలవాటు ఒకటి ఉంది. అదే రాత్రి భోజనం చేశాక కాసేపు నడవడం. ప్రతిరోజూ రాత్రి తిన్న తర్వాత ఎందుకు నడుస్తారో, దీనివల్ల జీర్ణ వ్యవస్థ ఎలా మెరుగుపడుతుందో, షుగర్ లెవెల్స్ ఎలా కంట్రోల్లో ఉంటాయో సోషల్ మీడియా ద్వారా అయన చెప్పుకొచ్చారు.

కడుపు ఉబ్బరానికి సులభమైన పరిష్కారం భోజనం చేసిన తర్వాత చాలా మంది కడుపు ఉబ్బరంగా ఉందనో లేదా గ్యాస్ వల్ల ఇబ్బందిగా ఉందనో బాధపడుతుంటారు. దీనికి చిన్న నడకే బెస్ట్ మందు. తిన్న తర్వాత నడవడం వల్ల మనం తిన్న ఆహారం కడుపులో నుండి ప్రేగుల్లోకి త్వరగా, సులభంగా వెళ్తుంది. ఇది జీర్ణవ్యవస్థలోని కండరాలను ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, నెరజాసం (యాసిడ్ రిఫ్లక్స్), మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

చాలా మంది తిన్న వెంటనే భారంగా అనిపించి కూర్చుండిపోతారు. కానీ ఆ సమయంలో నెమ్మదిగా నడవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ వేగవంతమై, కడుపు తేలికగా మారుతుంది.

షుగర్ లెవెల్స్ పెరగకుండా రాత్రి భోజనం చేసిన తర్వాత కేవలం 10 నిమిషాలు నడిచినా సరే, రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అడ్డుకోవచ్చని డాక్టర్ చెప్తున్నారు. మనం నడుస్తున్నప్పుడు మన శరీరంలోని కండరాలు యాక్టివ్‌గా మారి, రక్తంలోని గ్లూకోజ్‌ను శక్తిగా మార్చుకుంటాయి. దీనివల్ల శరీరం చక్కెరను ఈజీగా జీర్ణం చేసుకోగలుగుతుంది.

షుగర్ వ్యాధి ఉన్నవారికి లేదా మెటబాలిజం (జీవక్రియ) మెరుగుపరుచుకోవాలి అనుకునేవారికి ఈ చిన్న అలవాటు ఎంతో మేలు చేస్తుంది. తిన్న వెంటనే సోఫాలో కూర్చోవడం కంటే, కాసేపు నడవడం వల్ల పెద్దగా శ్రమ లేకుండానే మంచి ఆరోగ్యం లభిస్తుంది.

రూపాయి ఖర్చు లేని ఆరోగ్య రహస్యం కడుపు ఆరోగ్యం కోసం మార్కెట్లో దొరికే రకరకాల జ్యూస్‌లు, వెల్ నెస్ ప్రోగ్రామ్‌ల కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ చిన్న నడకకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు. పైగా ఇది సైంటిఫిక్‌గా నిరూపించబడింది కూడా.

దీనికి ఎలాంటి జిమ్ సామాన్లు గానీ, ప్రత్యేక ట్రేనింగ్ గానీ అవసరం లేదు. ప్రతిరోజూ తప్పకుండా పాటిస్తే చాలు... మీ జీర్ణక్రియ బాగుంటుంది, ప్రేగులు ఆరోగ్యంగా ఉంటాయి.

చివరగా డాక్టర్ చెప్పే మాట ఏంటంటే... తిన్న తర్వాత కదలకుండా కూర్చునే వారి కంటే, కాసేపు నడిచే వారి జీర్ణవ్యవస్థ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఏవేవో కష్టమైన పద్ధతులు ట్రై చేయకుండా, భోజనం తర్వాత చిన్న నడకతో మీ ఆరోగ్య ప్రయాణాన్ని మొదలుపెట్టండి.