రియల్ బూమ్ @ ఓఆర్ఆర్! ..ఔటర్ చుట్టూ భారీగా పెట్టుబడులు..పెద్ద ఎత్తున భూముల క్రయవిక్రయాలు
ఓఆర్ఆర్ చుట్టూ భూమి విలువలు పెరుగుతున్నాయి
Indiabreakingdaily.com – ర యల బ మ ఓఆర ఆర ఔటర - హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) ప్రధాన కారణంగా మారింది. రవాణా, మౌలిక వసతులలో జరిగిన మార్పులు ఈ ప్రాంతాన్ని ఆకర్షణీయంగా మార్చాయి. వ్యాపార, పారిశ్రామిక, ఐటీ కార్యకలాపాలు నగరం నలువైపులా విస్తరిస్తుండటంతో ఓఆర్ఆర్ చుట్టూ భూములు, నివాస గృహాలు, వాణిజ్య సముదాయాల కొనుగోళ్లు పెరిగాయి.
ఆదాయంలో భారీ పెరుగుదల
2025–26 ఆర్థిక సంవత్సరంలో ఓఆర్ఆర్ పరిధిలో 4.11 లక్షలకు పైగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ లావాదేవీల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 9,500 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఓఆర్ఆర్ మార్గంలోని కనెక్టివిటీ మెరుగ్గా ఉండటం, విల్లాలు, హైరైజ్ అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ ప్రాజెక్టులకు అనుమతులు లభించడం వల్ల స్థానిక కొనుగోలుదారులతోపాటు దేశ విదేశాల పెట్టుబడిదారులు కూడా ఈ ప్రాంతంపై ఆసక్తి చూపుతున్నారు.
గణాంకాల ప్రకారం ఓఆర్ఆర్ లోపల ఉన్న 25 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మొత్తం 2,22,348 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. ఇందులో రూ. 5,219 కోట్ల ఆదాయం లభించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం డాక్యుమెంట్లలో ఇది 13 శాతం కాగా, మొత్తం రాబడిలో 34 శాతం వాటాను కైవసం చేసుకుంది.
అటు ఓఆర్ఆర్‌ను అనుకొని ఉన్న 10 సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల పరిధిలో 1,89,639 డాక్యుమెంట్లు నమోదు కాగా, రూ. 4,281 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది మొత్తం డాక్యుమెంట్లలో 11 శాతం, మొత్తం ఆదాయంలో 28 శాతం వాటా కావడం గమనార్హం. ఈ రెండింటిని కలిపి చూస్తే ఓఆర్ఆర్ ప్రభావిత ప్రాంతాల నుంచి 4,11,987 డాక్యుమెంట్ల ద్వారా రూ. 9,500 కోట్ల భారీ ఆదాయం సమకూరినట్లయింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన మొత్తం రూ. 15,280 కోట్ల రాబడిలో ఇది దాదాపు 65 శాతం కావడం ఇక్కడి రియల్ ఎస్టేట్ బూమ్‌కు నిదర్శనం.
పెట్టుబడులకు కారణాలు
ఓఆర్ఆర్ చుట్టూ విస్తరిస్తున్న పట్టణీకరణ, ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ రంగాలు ఇక్కడి భూముల విలువ స్థిరమైన వృద్ధి కనబరుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గాంధీపేట్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, పటాన్‌చెరు, రాజేంద్రనగర్, ఉప్పల్, కూకట్‌పల్లిలాంటి ప్రధాన ప్రాంతాల్లో భూముల రేట్లు ఎక్కువగా ఉన్నందున డాక్యుమెంట్లు కాస్త తక్కువే నమోదైనా ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం లభిస్తోంది.
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రతి చదరపు గజం లేదా ఫ్లాట్ అధిక విలువ కలిగి ఉండడమే రాబడిలో భారీ వ్యత్యాసానికి ప్రధాన కారణమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులో ఓఆర్ఆర్ కారిడార్ చుట్టూ మౌలిక వసతులు మరింత విస్తరించనుండటంతో పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
రేడియల్ రోడ్ల అనుసంధానం, మెట్రో విస్తరణ ప్రాజెక్టులు, శాటిలైట్ టౌన్‌షిప్‌ల రూపకల్పనలాంటి ప్రణాళికలు ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాలకు అదనపు ఆకర్షణగా మారాయి.
నగరవాసుల ఆలోచనా విధానంలో మార్పు
నగరవాసుల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులు కూడా ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు పెరగడానికి కారణమవుతున్నాయి. కాంక్రీట్ వనంగా మారిన ప్రధాన నగరంలో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం, వాహనాల రొద, ట్రాఫిక్ రద్దీ నుంచి ఉపశమనం పొందేందుకు అనేకమంది నగరం ఆవల, ప్రకృతికి దగ్గరగా నివసించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
రోజువారీ పని ఒత్తిడి తర్వాత ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి లభించే గేటెడ్ కమ్యూనిటీలు, ఓపెన్ ప్లాట్లతో కూడిన ఇండిపెండెంట్ ఇండ్లు, విల్లాల వైపు ఐటీ నిపుణులు, ఎగువ మధ్యతరగతి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. పశ్చిమ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, కోకాపేట, తెల్లాపూర్, నార్సింగి పరిసరాల్లో మొదలైన హైరైజ్ నిర్మాణాలు ఇప్పుడు తూర్పు, ఉత్తర ప్రాంతాలైన ఘట్‌కేసర్, శామీర్‌పేట్, మేడ్చల్ వైపు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి.
ట్రిపుల్ ఆర్ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి
గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) ప్రాంతాల వైపు కూడా క్రమంగా రియల్ ఎస్టేట్ లావాదేవీలు విస్తరిస్తున్నాయి. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య ఉన్న ప్రాంతాల్లోని 4 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 36,511 డాక్యుమెంట్లు నమోదు కాగా, రూ. 266 కోట్ల రాబడి (2 శాతం) లభించింది.
ట్రిపుల్ ఆర్‌కు ఇరువైపులా ఉన్న 13 సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల ద్వారా 1,04,980 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయి రూ. 666 కోట్ల ఆదాయం లభించింది. అలాగే ట్రిపుల్ ఆర్ వెలుపల ఉన్న 92 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 6,01,085 డాక్యుమెంట్లు నమోదైనప్పటికీ, రాబడి మాత్రం రూ. 1,827 కోట్లు మాత్రమే ఉంది.
రాబోయే రోజుల్లో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం పుంజుకుంటే ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య ఉన్న భూములకు డిమాండ్ మరింత పెరిగి, నమోదు డాక్యుమెంట్ల సంఖ్య కూడా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఫ్రీక్వెంట్లీ అస్క్డ్ క్వెస్టన్స్
ఓఆర్ఆర్ చుట్టూ భూమి రేట్లు ఎంత పెరిగాయి? గణాంకాల ప్రకారం ఓఆర్ఆర్ ప్రభావిత ప్రాంతాల నుంచి 4,11,987 డాక్యుమెంట్ల ద్వారా రూ. 9,500 కోట్ల భారీ ఆదాయం సమకూరినట్లయింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన మొత్తం రూ. 15,280 కోట్ల రాబడిలో ఇది దాదాపు 65 శాతం కావడం ఇక్కడి రియల్ ఎస్టేట్ బూమ్‌కు నిదర్శనం.
ఓఆర్ఆర్ లోపల ఎన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి? ఓఆర్ఆర్ లోపల 25 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో 2,22,348 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. ఇందులో రూ. 5,219 కోట్ల ఆదాయం లభించింది.
ట్రిపుల్ ఆర్ ప్రాంతంలో డాక్యుమెంట్ల నమోదు ఎంత? ట్రిపుల్ ఆర్‌కు ఇరువైపులా ఉన్న 13 సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల ద్వారా 1,04,980
Related Reading
Frequently Asked Questions
What is ర యల బ మ ఓఆర ఆర ఔటర?ర యల బ మ ఓఆర ఆర ఔటర is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does ర యల బ మ ఓఆర ఆర ఔటర matter?ర యల బ మ ఓఆర ఆర ఔటర matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.