రక్షణ రంగంలోకి రిలయన్స్ ఎంట్రీ: యుద్ధ విమానాలకు ఇంజన్ల అభివృద్ధిలో అంబానీ
రిలయన్స్-రోల్స్ రాయిస్ భాగస్వామ్యం: యుద్ధ విమాన ఇంజిన్ల అభివృద్ధిలో కొత్త అధ్యాయం
Indiabreakingdaily.com – రక షణ ర గ ల క ర - అంబానీ కుటుంబానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు రక్షణ రంగంలో కూడా తన ప్రభావాన్ని చూపిస్తోంది. పెట్రోలియం, టెలికాం, రిటైల్ మరియు పవర్ రంగాల్లో ఇప్పటికే బలమైన స్థానం సంపాదించిన ఈ సంస్థ, బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ ఇంజిన్ తయారీదారు రోల్స్ రాయిస్‌తో చేతులు కలిపింది. భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్ట్ కోసం ఈ రెండు సంస్థలు కలిసి అత్యాధునిక యుద్ధ విమాన ఇంజిన్లను రూపొందించనున్నాయి.
స్వదేశీ సామర్థ్యం పెంపుదలకు కొత్త కేంద్రం
ఈ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా భారత్‌లో ఒక ప్రత్యేకమైన ఏరోస్పేస్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయడానికి రెండు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ కేంద్రాన్ని పవర్ అండ్ ప్రొపల్షన్ టెక్నాలజీ రంగంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విమాన ఇంజిన్ల డిజైన్, తయారీ మరియు పరీక్షల వంటి అన్ని దశల్లోనూ స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం ఈ భాగస్వామ్యం ప్రధాన ఉద్దేశ్యం.
దేశ స్వయంప్రతిపత్తికి కీలక రంగాలలో సొంత సాంకేతికత ఉండటం ఎంతో అవసరమని ఈ భాగస్వామ్యంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తెలిపారు. రోల్స్ రాయిస్ కలిగి ఉన్న ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని.. రిలయన్స్ తయారీ, సాంకేతిక శక్తిని జోడించి దేశంలో బలమైన ఏరో-ఇంజిన్ ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తామని చెప్పారు.
చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ ఒప్పందం
ఇంజన్ల తయారీలో తమకు ఉన్న ఇంజనీరింగ్ అనుభవాన్ని, రిలయన్స్ ఇండస్ట్రీస్ నాయకత్వంతో కలిసి భారత్‌లో రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇదొక చారిత్రక అడుగుగా రోల్స్ రాయిస్ సీఈఓ తుఫాన్ ఎర్గిన్బిలిక్ అభివర్ణించారు. ఈ డీల్ ప్రధాని మోడీ కలలు కంటున్న ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు ఎంతగానో దోహదపడుతుందని రెండు కంపెనీలు పేర్కొన్నాయి.
డిఫెన్స్, ఏవియేషన్ రంగానికి భవిష్యత్తులో ఈ డీల్ కీలకంగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రిలయన్స్ మరియు రోల్స్ రాయిస్ మధ్య ఈ భాగస్వామ్యం భారతదేశం యొక్క రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Related Reading
Frequently Asked Questions
What is రక షణ ర గ ల క ర?రక షణ ర గ ల క ర is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does రక షణ ర గ ల క ర matter?రక షణ ర గ ల క ర matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.