మ్యూచువల్ ఫండ్స్‌లో ఆశించిన లాభాలు రావట్లేదా..? ఈ తప్పు చేస్తున్నారేమో చూస్కోండి

Share: X Facebook
51b4bf42-4589-4ba4-9ce1-e877e1647673-0

మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువైతే డైవర్సిఫికేషన్ సరిగ్గా ఉందా? Indiabreakingdaily.com – మ య చ వల ఫ డ స – పెట్టుబడిదారులు సాధారణంగా ఒకే విధమైన ఊహతో ముందుకు

మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువైతే డైవర్సిఫికేషన్ సరిగ్గా ఉందా?

Indiabreakingdaily.com – మ య చ వల ఫ డ స – పెట్టుబడిదారులు సాధారణంగా ఒకే విధమైన ఊహతో ముందుకు సాగుతారు. తమ వద్ద ఎక్కువ స్కీమ్స్ ఉంటే ప్రమాదం తగ్గుతుందని భావిస్తారు. లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ELSS, మల్టీ క్యాప్, ఫోకస్డ్ ఫండ్ అనే ఐదు రకాలు ఎంచుకుంటే తమ డబ్బు పూర్తిగా సురక్షితమవుతుందని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే.. వేర్వేరు ఫండ్‌లలో డబ్బు పెట్టినా, ఆ ఫండ్‌లు పెట్టుబడి పెట్టే కంపెనీలు ఒకటే అయితే అది నిజమైన విభజన కాదు.

ఒకే కంపెనీలు పదేపదే కనిపించడం ఎందుకు?

ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలను గమనిస్తే ఒక విచిత్రమైన విషయం తెలుస్తుంది. వేర్వేరు ఫండ్ హౌస్‌ల నుండి వచ్చే, వేర్వేరు పేర్లతో ఉన్న స్కీమ్స్‌లో కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, ఇన్ఫోసిస్, లార్సెన్ అండ్ టూబ్రో, భారతి ఎయిర్‌టెల్ వంటి పెద్ద సంస్థలు తరచుగా కనిపిస్తాయి. బయటకు చూస్తే ఐదు ఫండ్స్ ఉన్నట్లు అనిపించినా.. వాస్తవానికి పెట్టుబడి కొన్ని అదే కంపెనీల ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది. దీనినే ఓవర్‌ల్యాప్ లేదా డైవర్సిఫికేషన్ ఇల్యూజన్ అంటారు.

అన్ని ఫండ్స్ ఒకే స్టాక్స్‌ను ఎందుకు కొంటాయి? దీనికి ప్రధాన కారణం భారత స్టాక్ మార్కెట్‌లో కొన్ని పెద్ద కంపెనీల ఆధిపత్యం. మార్కెట్ క్యాపిటలైజేషన్, లిక్విడిటీ, స్థిరమైన ఆదాయాలు ఉన్న సంస్థలు ఫండ్ మేనేజర్లకు సహజంగానే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే వేర్వేరు ఫండ్ మేనేజర్లు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నా, చివరకు మంచి కంపెనీల ఎంపికలో వారి ఆలోచనలు ఒకే దిశలో కలిసే అవకాశం ఉంటుంది. ఇది ఫండ్ మేనేజ్‌మెంట్ లోపం కాదు. కానీ ఇన్వెస్టర్ ఒకే పెట్టుబడి ఆలోచనను పలుమార్లు కొనుగోలు చేస్తున్నాడా అనేది ముఖ్యమైన విషయం.

ఫండ్స్ సంఖ్య కాదు.. పెట్టుబడి ఆలోచనలే ముఖ్యం

5 ఫండ్స్ ఉన్నాయని చెప్పడం కంటే.. అవి ఎలాంటి రాబడి అవకాశాలను అందిస్తున్నాయనేది ముఖ్యం. ఒక క్రికెట్ జట్టులో బ్యాట్స్‌మెన్ మాత్రమే ఉంటే సరిపోదు. బౌలర్లు, ఆల్‌రౌండర్లు కూడా అవసరం. అలాగే పోర్ట్‌ఫోలియోలో కూడా వేర్వేరు రకాల పెట్టుబడులు ఉండాలి. ఒక లార్జ్ క్యాప్ లేదా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌ను ప్రధాన పెట్టుబడిగా ఉంచుకుని, మిడ్ క్యాప్ ఫండ్ ద్వారా గ్రోత్ ఆపర్చునిటీస్, గ్లోబల్ ఫండ్ ద్వారా విదేశీ మార్కెట్ల ఎక్స్‌పోజర్, డెట్ లేదా హైబ్రిడ్ ఫండ్స్ ద్వారా స్థిరత్వం పొందవచ్చు.

స్టాక్ ఓవర్‌ల్యాప్ మాత్రమే కాదు.. స్టైల్ ఓవర్‌ల్యాప్ కూడా.. ఒకే స్టాక్స్ ఉండటమే కాకుండా.. రెండు ఫండ్స్ ఒకే విధమైన పెట్టుబడి విధానాన్ని అనుసరిస్తే కూడా రిస్క్ పెరుగుతుంది. ఉదాహరణకు రెండు ఫండ్స్ వేర్వేరు కంపెనీల్లో పెట్టుబడి పెట్టినా, రెండూ పెద్ద కంపెనీలు లేదా ఒకే రంగాలపై ఆధారపడితే మార్కెట్ మార్పులకు ఒకే విధంగా స్పందించే అవకాశం ఉంటుంది.

స్మార్ట్ ఇన్వెస్టర్ చేయాల్సిన పని ఇదే.. ఫండ్ పోర్ట్‌ఫోలియోను కేవలం ఫండ్స్ సంఖ్యతో కాకుండా, ప్రతి ఫండ్ అందించే ప్రత్యేక ప్రయోజనంతో అంచనా వేయాలి.

కాలానుగుణంగా పోర్ట్‌ఫోలియోలో ఓవర్‌ల్యాప్ ఉందా, ఒకే రంగంపై ఎక్కువ ఆధారపడి ఉన్నామా అనే విషయాలను పరిశీలించాలి. ఎక్కువ ఫండ్స్ కలిగి ఉండటం వల్ల ఎప్పుడూ ఎక్కువ సేఫ్టీ రాదు. నిజమైన డైవర్సిఫికేషన్ అంటే వేర్వేరు ఆలోచనలు, రంగాలు, పెట్టుబడి విధానాల కలయిక. మార్కెట్ అనూహ్యంగా మారినప్పుడు మీ పెట్టుబడిని కాపాడేది మీకు ఎన్ని ఫండ్స్ ఉన్నాయన్నది కాదు.. వాటి మధ్య ఉన్న వైవిధ్యమే.

Frequently Asked Questions

Apa itu మ య చ వల ఫ డ స?

మ య చ వల ఫ డ స adalah topik utama yang dibahas di artikel ini dengan konteks praktis agar pembaca memahami informasinya dengan jelas.

Mengapa మ య చ వల ఫ డ స penting?

మ య చ వల ఫ డ స penting karena membantu pembaca membandingkan pilihan, menghindari kesalahan umum, dan mengambil keputusan yang lebih tepat.

Bagaimana cara memakai panduan మ య చ వల ఫ డ స ini?

Gunakan poin utama, contoh, dan tautan terkait di halaman ini sebagai rujukan awal, lalu cek detail terbaru sebelum mengambil keputusan final.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *