కుడా విస్తరణ కోసం ప్రపోజల్స్ పంపిన పరిస్థితి
మ గ క డ వర గల మ – వరంగల్ ప్రాంతం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) పురోగతి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేకుండా సొంతంగా రూ.500 కోట్ల వినియోగంతో కుడా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం గ్రేటర్ వరంగల్ మాస్టర్ ప్లాన్-2041 అందుకు అనుగుణంగా పరిధిని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు అందించారు. ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం.
కుడా విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం కుడా పరిధిలో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లోని 19 మండలాలు, 181 రెవెన్యూ గ్రామాలు కలిపి 1,805 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. చైర్మన్గా ఇనగాల వెంకట్రామిరెడ్డి ఉండగా, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కుడా పరిధిని 1000 చదరపు కిలోమీటర్ల మేర పెంచాలని నిర్ణయించారు. దీంతో సొంతంగా రూ.500 కోట్ల వినియోగంతో కుడా కొత్త ప్రాజెక్టులను సాగిస్తోంది.
ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అమలులో కుడా విజయవంతంగా ముందుకెళ్తోంది. గతానికి భిన్నంగా రైతులతో 50:50 వాటా విధానంలో ఒప్పందాలు కుదుర్చుకుని భూములు సేకరించి, వాటిని అభివృద్ధి చేసి విక్రయిస్తోంది.
కుడా ప్రాజెక్టుల విస్తరణ స్థితి
వ



