మన పాత బంగారం అమ్ముకుంటే వచ్చిన లాభానికి పన్ను కట్టాలా? పూర్తి వివరాలు
పాత బంగారం అమ్మినప్పుడు పన్ను చెల్లించాలా?
Indiabreakingdaily.com – మన ప త బ గ ర అమ - భారతదేశంలోని పన్ను నియమాల ప్రకారం బంగారం ఒక ముఖ్యమైన క్యాపిటల్ అసెట్‌గా గుర్తించబడుతుంది. కాబట్టి, మీరు ఈ ఆభరణాలను అమ్మినప్పుడు వచ్చే లాభంపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది. ఈ పన్ను ఎంత ఉంటుందనేది మీరు ఆ బంగారాన్ని ఎంత కాలం పాటు ఉంచుకున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
హోల్డింగ్ పీరియడ్ ప్రకారం పన్ను విధానం
బంగారాన్ని అమ్మే ముందు దాని హోల్డింగ్ కాలం చాలా ముఖ్యమైనది. ఈ కాలం ప్రకారం రెండు రకాల పన్నులు వర్తిస్తాయి:
లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్: మీరు బంగారాన్ని కొన్న తర్వాత 24 నెలల కంటే ఎక్కువ కాలం (అంటే 2 ఏళ్లు పూర్తి అయిన తర్వాత) అమ్మితే, అది లాంగ్-టర్మ్ అసెట్‌గా పరిగణించబడుతుంది. ఇటువంటి సందర్భంలో, ఇండెక్సేషన్ బెనిఫిట్ లేకుండా ఫ్లాట్ రేటు 12.5% పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
షార్ట్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్: ఒకవేళ గోల్డ్ కొన్న తర్వాత హోల్డింగ్ పీరియడ్ 24 నెలల కంటే తక్కువగా ఉంటే, దానిని షార్ట్-టర్మ్ లాభంగా పరిగణిస్తారు. ఈ లాభాన్ని మీ వార్షిక ఆదాయానికి కలిపి, వర్తించే ఆదాయపు పన్ను శ్లాబ్ రేట్ల ప్రకారం పన్ను విధిస్తారు.
లాభాన్ని లెక్కించే విధానం
పన్నుకు వర్తించే లాభాన్ని లెక్కించడానికి, అమ్మిన రోజున వచ్చిన రేటు నుంచి అసలు కొనుగోలు ధరకు సంబంధించిన ఖర్చును మినహాయిస్తారు. ఒకవేళ ఆ బంగారం మీకు వారసత్వంగా వస్తే, అసలు యజమాని చెల్లించిన కొనుగోలు ధరనే పరిగణలోకి తీసుకుంటారు.
అదేవిధంగా, ఏప్రిల్ 1, 2001 కంటే ముందే ఆ ఆభరాణాలు పొందినట్లయితే, రిజిస్టర్డ్ వాల్యూయర్ నివేదిక ద్వారా ఆ తేదీ నాటి ఫెయిర్ మార్కెట్ వాల్యూను బేస్‌లైన్ కాస్ట్‌గా ఉపయోగించుకునే వెసులుబాటు పన్ను చెల్లింపుదారులకు ఉంటుంది.
సో ప్రజలు తమ అవసరాల కోసం లేదా లాభాలను క్యాష్ చేసుకోవటానికి పాత బంగారం అమ్మితే దానిపై కూడా ఖచ్చితంగా పన్ను కట్టాల్సి ఉంటుందని మర్చిపోవద్దు.
Related Reading
Frequently Asked Questions
What is మన ప త బ గ ర అమ?మన ప త బ గ ర అమ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does మన ప త బ గ ర అమ matter?మన ప త బ గ ర అమ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.