పైలట్ కార్లు, ఫేక్ నెంబర్ ప్లేట్లతో గంజాయి స్మగ్లింగ్.. ORR దగ్గర 110 కిలోల గంజాయి సీజ్
హైదరాబాద్ పరిధిలో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ చేసే వారు అంతర్రాష్ట్ర కార్యకలాపాల గుట్టు రట్టయింది
ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా రవాణా చేసే ముఠా అరెస్ట్
ప లట క ర ల ఫ క - శంషాబాద్ టాస్క్ ఫోర్స్ సహా ఆదిబట్ల పోలీసులు కలిసి జరిగిన దాడిలో ముఠా సభ్యులను అరెస్ట్ చేసి, 110 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఈ ముఠా నుంచి రూ. 56 లక్షల విలువైన గంజాయితో పాటు, రెండు కార్లు మరియు నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ డీసీపీ రాజేష్ వెల్లడించారు.
పోలీసుల వేటు గప్పేందుకు ఈ ముఠా ప్రత్యేక స్కెచ్ వేసింది. గంజాయిని రవాణా చేసేందుకు టాటా హారియర్, మారుతి ఎర్టిగా వాహనాలను ఉపయోగించారు. వారు ఒక కారును పైలట్ వాహనంగా ముందు పంపుతూ... పోలీస్ చెక్ పోస్టుల సమాచారాన్ని వెనుక వచ్చే కారుకు ఎప్పటికప్పుడు చేరవేసేవారు. టోల్ గేట్లలో దొరకకుండా ఉండేందుకు నకిలీ మహారాష్ట్ర నెంబర్ ప్లేట్లను వాడి, పోలీసుల నిఘా తప్పించుకోవడానికి ఇంటర్నెట్ కాలింగ్ కూడా ఉపయోగించారు. ఇందులో ఉన్న పక్కా సమాచారంతో పోలీసులు వ్యూహాత్మకంగా ఈ రెండు వాహనాలను అడ్డుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఒడిశాలోని బెర్హంపూర్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్రలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. కిలో నాలుగు వేల రూపాయలకే గంజాయిని కొనుగోలు చేసే ప్రభిత్ర ప్రధాన్ అనే సరఫరాదారు ఉన్నాడని వివరించారు.
ప్రస్తుతం ఈ రాకెట్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ప్రణవ్ సింగ్ పరారీలో