IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

పెరిగిన స్కూలు ఫీజులతోనే చస్తుంటే.. ఇప్పుడు ‘పెద్ది ఫీజు’ కూడానా? మేకర్స్ పై విరుచుపడుతున్న నెటిజన్లు!

Published June 10, 2026 · Updated July 21, 2026 · By Matthew Williams - indiabreakingdaily.com

Foto : Matthew Williams - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – ప ర గ న స క ల - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుతున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ నటించిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi) థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 4, 2026న విడుదలైన ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యంత వేగంగా రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరిన ఫాస్టెస్ట్ సోలో మూవీగా 'పెద్ది' హిస్టరీ క్రియేట్ చేసింది.

ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత రామ్ చరణ్ ఊరమాస్ పర్ఫార్మెన్స్, బుచ్చిబాబు రా ఎమోషనల్ టేకింగ్, జాన్వీ కపూర్ గ్లామర్, శివ రాజ్‌కుమార్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాను నెక్స్ట్‌ లెవెల్‌కు తీసుకెళ్లాయి. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. అయితే ఈ సినిమాలో జాన్వీ పాత్రపై విమర్శలు వెంటాడుతున్నాయి. మరో వైపు లేటెస్ట్ నిర్మాత మైత్రి రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి దారితీస్తున్నాయి..

సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వేళ.. లేటెస్ట్ గా జరిగిన సక్సెస్ మీట్‌లో నిర్మాత మైత్రి రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఒక రేంజ్ చర్చకు దారితీశాయి. స్కూల్ ఫీజు, యూనిఫామ్ ఫీజుతో పాటు... #PEDDI ఫీజు అని కూడా ఒకటి పెట్టుకొని పిల్లలకు సినిమా చూపించండి. పేరెంట్స్ అందరికీ నాదో రిక్వెస్ట్.. ఈ కొత్త అకడమిక్ ఇయర్‌ మొత్తం వారికి చదువు, స్పోర్ట్స్‌కు సరిపడా ఇన్‌స్పిరేషన్ ఈ సినిమా ఇస్తుంది అని వ్యాఖ్యానించారు.

►ALSO READ | ఓటీటీలో ‘ధురంధర్ 2’ వీరవిహారం.. 50 మిలియన్ల వ్యూస్‌తో జియోహాట్‌స్టార్‌లో రికార్డులు!

దీంతో ఇప్పటికే పెరిగిన స్కూల్ ఫీజులతోనే చస్తుంటే.. ఇప్పుడు సినిమా టికెట్లకు, పాప్‌కార్న్‌లకు కూడా అదనంగా 'పెద్ది ఫీజు' బడ్జెట్ పెట్టుకోవాలా? అంటూ కొందరు నెటిజన్లు రవి కామెంట్స్‌ను గట్టిగా తప్పుబడుతున్నారు. మరోవైపు మెగా ఫ్యాన్స్ మాత్రం, సినిమాలో ఉన్న స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్, ఎమోషన్స్ పిల్లల భవిష్యత్తుకు ఎంతో మోటివేషన్‌గా నిలుస్తాయని, నిర్మాత కేవలం మంచి ఉద్దేశంతోనే ఆ మాట అన్నారని సపోర్ట్ చేస్తున్నారు.

Mythri Ravi: "స్కూల్ ఫీజు.. Uniform ఫీజు తో పాటు... #PEDDI ఫీజు పెట్టుకొని పిల్లలకు సినిమా చూపించండి Parents అందరికీ నా Request" pic.twitter.com/50P5HRtf6j

వివాదాలు ఎలా ఉన్నా, వర్కింగ్ డేస్‌లోనూ 'పెద్ది' కలెక్షన్ల వేట మాత్రం తగ్గలేదు.. నార్త్ ఇండియా, ఓవర్సీస్‌లో థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ఒకవైపు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ సినిమాకు మరింత ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతుండగా, లాంగ్ రన్‌లో ఈ చిత్రం మరిన్ని మైల్‌స్టోన్స్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

BOX OFFICE CHAMPION #PEDDI continues his dominance ?? #Peddi collects a gross of over 315 CRORES + GROSS WORLDWIDE in 5 days ❤‍? #PEDDI Now In Cinemas ? https://t.co/EMhY3eMGKq pic.twitter.com/e5fZ2thleb