పబ్‌జీ పిచ్చి: రూ.లక్ష టాస్క్ కోసం ఇల్లు విడిచి వెళ్లిన 14 ఏళ్ల బాలుడు.. చివరికి..

pubg-gaming-addiction-class-8-student-travels-hundreds-of-kilometers-for-rs-1-lakh-task_zyqSU1LbMg

Indiabreakingdaily.com – పబ జ ప చ చ – ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం ఈరోజుల్లో పెను ముప్పుగా మారింది. లక్ష రూపాయల బహుమతి గెలుచుకోవాలనే ఆశతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థి చేసిన సాహసం అందరినీ ఆందోళనకు గురిచేసింది. పబ్‌జీ గేమ్‌కు బానిసైన ఆ బాలుడు.. గేమ్‌లో భాగంగా ఇచ్చిన ఒక టాస్క్‌ను పూర్తి చేసేందుకు ఇల్లు విడిచి వందల కిలోమీటర్లు ప్రయాణించి.. చివరికి మథురలో క్షేమంగా పోలీసులకు చిక్కాడు.

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు క్లాస్ 8 చదువుతున్నాడు. కొద్దికాలం క్రితం తండ్రి మరణించడంతో ఆ బాలుడు మానసికంగా కుంగిపోయాడు. ఈ సమయంలో మొబైల్ ఫోన్‌కు ఎక్కువగా అతుక్కుపోయిన అతను.. క్రమంగా పబ్‌జీ ఆడటానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో గేమ్‌లో భాగంగా ఒక లక్ష రూపాయల నగదు బహుమతి గెలుచుకోవాలంటే గ్వాలియర్ వెళ్లాలనే ఒక టాస్క్ అతనికి వచ్చింది. ఆ ఆశతోనే అతను తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.

గత గురువారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో స్కూల్ బ్యాగ్ సర్దుకుని ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరాడు ఆ పిల్లవాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై అన్నిచోట్లా గాలించారు. కొద్ది రోజుల క్రితం చిన్న తమ్ముడి పాఠశాలలో తోటి విద్యార్థి తండ్రితో గొడవ జరగడంతో.. తమ కుమారుడిని వారే కిడ్నాప్ చేసి ఉంటారన్న అనుమానంతో కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లెయింట్ చేశారు.

పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. స్థానిక జైన్ ఆలయం సమీపంలో బాలుడు ఆటోలో వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ తర్వాత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మొబైల్ సర్వైలెన్స్ ద్వారా అతని ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేశారు. అయితే ఆ బాలుడు గ్వాలియర్ వెళ్లాల్సింది పోయి పొరపాటున ఇండోర్ చేరుకున్నాడు. అక్కడ తప్పుగా ప్రయాణించినట్లు గ్రహించి తిరిగి మరో బస్సు ఎక్కాడు. ప్రయాణంలో నిద్రపోవడంతో మరుసటి రోజు ఉదయానికి అతను మథుర చేరుకున్నాడు. అయినా వెనక్కి వెళ్లకుండా టాస్క్ పూర్తి చేసే ప్రయత్నంలో భాగంగా మథుర నుంచి మళ్లీ గ్వాలియర్‌కు బస్సు ఎక్కాడు. ఈ క్రమంలోనే పోలీసులు మొబైల్ ట్రాకింగ్ ద్వారా అతని కదలికలను గుర్తించి, మథురలోని ఆర్టీసీ బస్సులో గుర్తించి రక్షించారు.

ఈ ఘటన డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం పిల్లలపై ఎంతటి ప్రభావం చూపుతుందో కళ్లకు కడుతోంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, పిల్లలు ఒకేసారి ఒంటరితనం, వ్యసనాలకు బానిసకావడం ఎంతటి ప్రమాదకరమో ఈ ఉదంతం హెచ్చరిస్తోంది. పిల్లల మొబైల్ వాడకంపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలని.. ఆన్‌లైన్ మోసాలు, గేమింగ్ ట్రాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి నిరూపించింది. మెుత్తానికి పోలీసులు బాలుడిని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Frequently Asked Questions

What is పబ జ ప చ చ?

పబ జ ప చ చ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does పబ జ ప చ చ matter?

పబ జ ప చ చ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *