నిషేధిత భూములపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Indiabreakingdaily.com – న ష ధ త భ మ ల – హైదరాబాద్లోని కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో గురువారం (ఆగస్ట్ 13) ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన నిషేధిత జాబితా (22 A)లో ఉన్న భూముల విషయమై ప్రజలకు భరోసా ఇచ్చారు. హక్కుదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
22A జాబితా భూములపై హామీలు
కోర్టు కేసుల్లో ఉన్న భూముల సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చారు. అయితే, కోర్టు కేసులున్న స్థలాలను పక్కనపెట్టి మిగతా భూములకు బై-నంబర్లు ఇచ్చి సమస్యలను పరిష్కరిస్తున్నారని సీఎం వివరించారు. కొనుగోలు చేసిన హక్కుదారుల స్థలాలు ఎక్కడికీ పోవని హామీ ఇచ్చారు.
ఏదైనా కారణంగా మీ భూమి 22Aలో చేరి ఉంటే, కొనుగోలు చేసిన హక్కుదారుల స్థలాలు ఎక్కడికీ పోవు. నేను హామీ ఇస్తున్నా. కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సంబంధించి సర్వే నంబర్లో వచ్చిన మొత్తం భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. కోర్టు కేసులున్న స్థలాల వరకు పక్కనపెట్టి మిగతా వాటికి బైనెంబర్లు ఇచ్చి పరిష్కరిస్తున్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
కూకట్పల్లి అభివృద్ధిపై సూచనలు
కూకట్పల్లి ప్రాంత ప్రజలకు కావాల్సిన పనులు చేయించుకోవాలని మంత్రి శ్రీధర్ బాబుకు సీఎం సూచించారు. ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందన్నారు. రోడ్లు, ఫ్లైఓవర్లు, చెరువుల పునరుద్ధరణ, విద్య కోసం పాఠశాలలు, కాలేజీలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం అవసరమున్న పరిశ్రమల విషయంలో నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూడాలని కోరారు.
సంక్షేమ పథకాల వివరాలు
గత పాలనను, ఈ రెండేళ్ల పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని సీఎం అన్నారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వేటినీ నిలిపివేయలేదని, అదనంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.
రాష్ట్రంలో 3.28 కోట్ల మంది ప్రజలకు ప్రతి వ్యక్తికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నామని, రూ. 500 లకే సిలిండర్ అందజేస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారని అన్నారు.
ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఉద్యోగ, ఉపాధి కోసం చదువుల కోసం వెళ్లేవారు నెలకు ఆరేడు వేలు ఆదా చేసుకుంటున్నారని వివరించారు. ఇప్పటికే ఆర్టీసీకి 12 వేల కోట్లు చెల్లించారని, స్వయం సహాయక సంఘాలు 65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ ఇచ్చి రూ. 2500 కోట్ల వడ్డీ చెల్లించారని తెలిపారు.
ఇతర అభివృద్ధి పనులు
మహిళా సంఘాల పేరిట వెయ్యి బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి అద్దెకిప్పించారని, వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటుకు అవకాశం కల్పించారని సీఎం అన్నారు. ఆదిలాబాద్ అడవుల నుంచి అచ్చంపేట వరకు ఆడబిడ్డలు తయారు చేసిన వస్తువులను విక్రయించుకోవడానికి శిల్పారామంలో మూడున్నర ఎకరాల్లో ఇందిరా మహిళా బజార్ల ఏర్పాటుకు విలువైన స్థలమిచ్చారని తెలిపారు.
రెండేండ్లు తిరిగేలోపు ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖల్లో రెండేళ్లు తిరిగేలోపు 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని అన్నారు. కూకట్పల్లిలో వందల కోట్ల విలువ చేసే 11 ఎకరాల భూమిలో మంచి సంకల్పంతో ఇందిరమ్మ టవర్స్ నిర్మించే అద్భుతమైన కార్యక్రమం చేపట్టారని వివరించారు.
నిరుపేదల ఇళ్ల సంకల్పం
నగరంలో నిరుపేదలు ఎవరు ఎక్కడ నివసిస్తున్నారో వారికి అక్కడే ఇండ్లు ఇవ్వాలని సంకల్పించారని సీఎం అన్నారు. పేదల కోసం నిర్మించే ఇండ్లకయ్యే రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా రద్దు చేయాలని మంత్రులకు సూచించారు. ఇప్పుడు నిర్మించే ఇళ్లకు సంబంధించి నిరుపేదలకు స్థలం మొత్తం ఉచితంగా అందిస్తున్నారని, నిర్మాణానికి అయ్యే వ్యయంలో ఐదారు లక్షలు లబ్ధిదారులు భరిస్తే నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎలా సాగుతుందో ఎప్పుడైనా పరిశీలించే హక్కుదారులవుతారని వివరించారు.
నిరుపేదలు ఉండడానికి సొంత ఇళ్లు ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకు వెళుతున్నామని, సొంతింటి కల నెరవేరడానికి నూటికి నూరు శాతం అండగా నిలబడుతామని సీఎం హామీ ఇచ్చారు. మొదటి విడతగా కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కంటోన్మెంట్, ఎల్బీనగర్, ఉప్పల్ లాంటి అత్యధికంగా పేదలు ఉండే ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుండి పనులు చేయడానికి ఇక్కడికి వలసలు వచ్చిన ప్రాంతాల్లో ఉండటానికి మంచి ఇల్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు
గతంలో ఏదైనా పని చేయాలంటే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్.. ఇలా తిరగడానికే సమయం సరిపోయేదని, అందుకే ప్రజల సౌలభ్యం కోసం
Related Reading
Frequently Asked Questions
What is న ష ధ త భ మ ల?
న ష ధ త భ మ ల is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does న ష ధ త భ మ ల matter?
న ష ధ త భ మ ల matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.



