IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

నాకు ఆ బ్రీడ్ కుక్క పిల్ల కావాలి: పవన్ కల్యాణ్‎ను వింత కోరిక కోరిన అభిమాని

Published June 17, 2026 · Updated July 21, 2026 · By Robert Anderson - indiabreakingdaily.com

Foto : Robert Anderson - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – న క ఆ బ ర డ క - హైదరాబాద్: జన్యుపరమైన అరుదైన నరాల వ్యాధితో మంచానికే పరిమితమైన తన వీరాభిమాని నిరంజన్‎ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం (జూన్ 17) కలిశారు. స్వయంగా హన్మకొండ జిల్లాలోని అభిమాని ఇంటికి వెళ్లి పరామర్శించారు పవన్ కల్యాణ్. దాదాపు 40 నిమిషాల పాటు అభిమాని, అతడి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా నిరంజన్ తన అభిమాన నటుడిని ఒక వింత కోరిక కోరారు.

తనకు ఎంతో ఇష్టమైన పూడిల్ బ్రీడ్ కుక్క పిల్ల కావాలని పవన్ కల్యాణ్‎ను అడిగాడు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్.. 24 గంటల వ్యవధిలో నిరంజన్ కోరిన బ్రీడ్ కుక్కపిల్లను తెచ్చి ఇవ్వాలని తన టీమ్‎ను ఆదేశించాడు. కుక్కను పెంచుకోవడానికి ఇంటి ఓనర్స్ అనుమతి కావాలని నిరంజన్ తండ్రి చెప్పగా.. స్వయంగా ఆ ఇంటి ఓనర్స్‎ని పిలిపించి పవన్ కల్యాణ్ మాట్లాడారు. దీంతో నిరంజన్ కోరిన బ్రీడ్ కుక్క పిల్ల కోసం జనసైనికులు గాలిస్తున్నారు.

గ్రేటర్ వరంగల్ హనుమకొండ కేయూ రోడ్డులోని పెగడపల్లి డబ్బాల్ ప్రాంతానికి చెందిన పొనుగోటి రాము, మానస దంపతుల కొడుకు నిరంజన్. 17 సంవత్సరాల నిరంజన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డై హార్డ్ ఫ్యాన్. అయితే, ఏడేళ్ల వయసులో అరుదైన డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ(డీఎండీ) వ్యాధి బారిన పడ్డాడు. ఎముకలు విరిగిపోయేలా, కడుపు పగలిపోయేలా బాధించే ఈ జబ్బుతో పదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నాడు.

జన్యుపరమైన ఈ వ్యాధికి ఇప్పటివరకు చికిత్స లేదు. ఐదేండ్ల లోపు ప్రభావం చూపే ఈ వ్యాధి వల్ల శరీరం ఎదుగుదల ఆగిపోతుంది. ఈ రకం వ్యాధిగ్రస్తులకు ఆయుష్షు తక్కువగానే ఉంటుందని వైద్యరంగం చెబుతోంది. చికిత్స, మందుల కంటే అతడిని ఆనందంగా ఉండేలా చూసుకోవడం ద్వారానే ఆయుష్షు పెంచవచ్చని డాక్టర్లు ఇచ్చిన సలహాతో ఇంట్లో నడుచుకుంటున్నారు.

►ALSO READ | SIR ను లైట్ తీసుకోవద్దు..నిజాయితీగా ఎన్నికలు జరిగితే BRS కు 100 సీట్లు: కేటీఆర్

నిరంజన్‌కు ఇల్లే ప్రపంచం అయింది. కుటుంబ సభ్యులు, టీవీలో అతనికి నచ్చే సినిమాలే అతనికి జీవం పోస్తున్నాయి. ఈక్రమంలో అతను పవన్ కల్యాణ్ నటనకు ఫిదా అవుతూ పవర్‌స్టార్ ఫ్యాన్ అయ్యాడు. తన ముద్దుపేరును గబ్బర్‌సింగ్ అని పెట్టుకున్నాడు. ఏదో ఒకరోజు తన అభిమాన హీరోను కలవాలని ఆశతో ఉన్నాడు.

విషయం తెలిసిన పవన్ కల్యాణ్ తన అభిమానిని కలవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బుధవారం (జూన్ 17) స్వయంగా వరంగల్ లోని నిరంజన్ ఇంటికి వెళ్లి తన అభిమానిని కలిశాడు పవన్ కల్యాణ్. నిరంజన్ ఆరోగ్య పరిస్థితి, బాగోగులను తల్లిదండ్రులు రాము మానసలను అడిగి తెలుసుకున్నారు. నిరంజన్‎కు లక్ష రూపాయల తక్షణ నగదు సాయం అందించారు పవన్ కళ్యాణ్.