దుబాయ్ వెళ్లే తెలుగోళ్లకు అలర్ట్.. మారిన రూమ్ షేరింగ్ రూల్స్ తెలుసా?
దుబాయ్‌లో రూమ్ షేరింగ్‌కు కొత్త నిబంధనలు అమల్లోకి
Indiabreakingdaily.com – ద బ య వ ళ ల త - ఉద్యోగం కోసం దుబాయ్‌కు వెళ్లే తెలుగు వారు అద్దె ఖర్చులు తగ్గించుకోవడానికి సహోద్యోగులు, స్నేహితులతో కలిసి ఒకే ఇంటిలో ఉండటం సర్వసాధారణం. ఈ సాధారణ విధానంపై ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. Dubai Law No. (4) of 2026 అనే ఈ చట్టం 2026 ఆగస్టు 26 నుండి అమల్లోకి రానుంది. ఇది రూమ్ షేరింగ్‌ను పూర్తిగా నిషేధించడం లేదు. అయితే అనుమతి లేకుండా గదులు, బెడ్‌స్పేస్‌లను అద్దెకు ఇవ్వడంపై కఠిన నిబంధనలు విధించింది.
లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి
ఒక ఫ్లాట్‌లోని గదిని లేదా బెడ్‌ను మరొకరికి అద్దెకు ఇవ్వాలంటే ఇంటి యజమాని నుంచి తప్పనిసరిగా రాతపూర్వక అనుమతి తీసుకోవాల్సిందేనని కొత్త చట్టం నిర్దేశించింది. దుబాయ్ చట్టాల ప్రకారం ఈ విధానం సబ్‌లెట్టింగ్ కిందకు వస్తుంది. ఉదాహరణకు ఒక బెడ్‌రూమ్ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్న వ్యక్తి భారాన్ని తగ్గించుకోవడానికి మరొకరిని తీసుకురావాలనుకుంటే, ముందుగా ఇంటి యజమాని నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవాలి. లేకపోతే రెంటల్ అగ్రిమెంట్ ఉల్లంఘించినట్లే పరిగణిస్తారు.
అధికారిక అనుమతి విధానం
కొత్త చట్టంతో షేర్డ్ హౌసింగ్‌కు అధికారిక అనుమతి విధానం కూడా అమల్లోకి వస్తోంది. షేర్డ్ అకామడేషన్‌గా ఉపయోగించే అపార్ట్‌మెంట్‌లు, విల్లాలకు దుబాయ్ మున్సిపాలిటీ నుంచి ప్రత్యేక పర్మిట్ ఉండాలి. ఈ అనుమతి పొందాలంటే భవనం భద్రత, అగ్నిమాపక ప్రమాణాలు, పారిశుధ్యం, ప్రతి వ్యక్తికి కనీస స్థలం, అవసరమైన సౌకర్యాలు వంటి నిబంధనలు పాటించాలి. సాధారణంగా ఈ పర్మిట్ ఒక సంవత్సరం చెల్లుబాటు అవుతుంది. అవసరమైతే రెండేళ్ల పర్మిట్ కూడా తీసుకోవచ్చు.
ఎవరు అద్దెకు ఇవ్వవచ్చు?
కొత్త చట్టం ప్రకారం ఇంటి యజమానులు, ప్రభుత్వ అనుమతి పొందిన లైసెన్స్ ఉన్న సంస్థలు మాత్రమే షేర్డ్ అకామడేషన్‌ను అద్దెకు ఇవ్వగలవు. సాధారణ అద్దెదారులు తమ ఇష్టానుసారంగా గదులు, బెడ్‌స్పేస్‌లను ఇతరులకు అద్దెకు ఇవ్వడానికి అనుమతి ఉండదు. అలాగే అనుమతి లేని పార్టిషన్ రూమ్‌లు, బెడ్‌స్పేస్ ప్రకటనలపై కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది.
ఉల్లంఘనపై కఠిన చర్యలు
మారిన చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి. తప్పిదాన్ని బట్టి 500 దిర్హామ్‌ల నుంచి 5 లక్షల దిర్హామ్‌ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఒకే తప్పు మళ్లీ చేస్తే జరిమానా 10 లక్షల దిర్హామ్‌ల వరకు పెరగవచ్చు. అంతేకాదు షేర్డ్ హౌసింగ్ పర్మిట్‌ను రద్దు చేయడం, సంబంధిత ఆస్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది.
దుబాయ్‌లో ఉద్యోగం కోసం వెళ్లే వారు అద్దె ఖర్చు తగ్గించుకోవడానికి రూమ్ షేరింగ్ చేయాలనుకుంటే ముందుగా రెంట్ అగ్రిమెంట్‌లో సబ్‌లెట్టింగ్‌కు అనుమతి ఉందో లేదో తెలుసుకోవాలి. ఇంటి యజమాని నుంచి రాతపూర్వక అనుమతి లేకుండా ఎవరికైనా గది లేదా బెడ్ అద్దెకు ఇవ్వడం భవిష్యత్తులో భారీ జరిమానాలకు దారితీయొచ్చు. కాబట్టి కొత్త నిబంధనలను తెలుసుకుని వాటికి అనుగుణంగా వ్యవహరించడం కష్టాల నుంచి కాపాడుతుంది.
Related Reading
Frequently Asked Questions
What is ద బ య వ ళ ల త?ద బ య వ ళ ల త is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does ద బ య వ ళ ల త matter?ద బ య వ ళ ల త matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.