తెలంగాణలో కిక్కిచ్చే ఫైట్ .. 41 బార్లకు 8,771 అప్లికేషన్లు
Indiabreakingdaily.com – త ల గ ణల క క క - హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త బార్ లైసెన్సుల కోసం మద్యం వ్యాపారులు పోటెత్తారు. ఎక్సైజ్ శాఖ కొత్తగా నోటిఫై చేసిన 41 బార్లకు రికార్డు స్థాయిలో ఏకంగా 8,771 దరఖాస్తులు వెల్లువెత్తాయి. అప్లికేషన్ల ఫీజులతోనే ప్రభుత్వ ఖజానాకు రూ.87.71 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేసి కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్-) పరిధిగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో పాటు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన 27 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పెరిగిన జనాభా ప్రాతిపదికన ఎక్సైజ్ శాఖ ఇటీవల 41 కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులు ఆహ్వానించగా వ్యాపారుల నుంచి భారీ స్పందన లభించింది. ఒక్కో బార్ కోసం వందల సంఖ్యలో పోటీ పడ్డారు. లక్కీ డ్రా ద్వారా లైసెన్సులు దక్కించుకునేందుకు సిండికేట్లు కోట్లాది రూపాయలను నాన్-రిఫండబుల్ ఫీజుల కింద ప్రభుత్వానికి చెల్లించారు. త్వరలోనే డ్రా నిర్వహించి పారదర్శకంగా బార్ల కేటాయింపు పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ పరిధిని కలుపుతూ ఏర్పాటు చేసిన క్యూర్ పరిధిలోని 14 బార్లకు మద్యం వ్యాపారులు ఎగబడ్డారు. వీటి కోసమే ఏకంగా 4,252 దరఖాస్తులు రావడం గమనార్హం. అలాగే ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని 27 బార్లకు 4,519 అప్లికేషన్లు వచ్చాయి. ఫ్యూచర్ సిటీ, ఐటీ కారిడార్లకు సమీపంలోని శివారు ప్రాంతాల్లో బార్ల కోసం పోటీ తీవ్రస్థాయికి చేరింది. ఫ్యూచర్ సిటీ పరిధిలోని మొయినాబాద్‌లో రెండు బార్లకు అత్యధికంగా 664 దరఖాస్తులు రాగా, చేవెళ్లలోని బార్‌కు 279 దరఖాస్తులు వచ్చాయి. కుత్బుల్లాపూర్ ఈఎస్ పరిధిలోని అలియాబాద్లోని బార్‌కు 201 మంది పోటీపడ్డారు. యెల్లంపేట్లోని రెండు బార్లకు 225, మూడుచింతలపల్లిలోని రెండు బార్లకు 112 దరఖాస్తులు నమోదయ్యాయి. హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న పారిశ్రామిక ప్రాంతమైన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలోని రెండు బార్లకు 287, గడ్డపోతారంలో 112, కోహిర్లో 127 అప్లికేషన్లు వచ్చాయి. రియల్ ఎస్టేట్ బూమ్, ఫామ్‌హౌస్‌లు ఎక్కువగా ఉండే శివారు ప్రాంతాల్లో బార్ల ఏర్పాటుకు వ్యాపారులు పోటీ పడినట్లు స్పష్టమౌతోంది.
జిల్లాల విషయానికొస్తే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ బార్ల లైసెన్సుల కోసం భారీ డిమాండ్ కనిపించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో ఏర్పాటు కానున్న బార్‌కు ఏకంగా 376 దరఖాస్తులు వచ్చి రాష్ట్రంలోనే రెండో అత్యధిక డిమాండ్ ఉన్న కేంద్రంగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని బార్‌కు 357, జనగామ పరిధిలోని స్టేషన్ ఘన్‌పూర్‌లో 349, మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 331, ఖమ్మం జిల్లా కల్లూరులోని బార్ కోసం 325 దరఖాస్తులు దాఖలయ్యాయి.
ఏజెన్సీ ప్రాంతమైన కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బార్‌కు సైతం 207 అప్లికేషన్లు రావడం గమనార్హం. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని బార్‌కు 131 దరఖాస్తులు వచ్చాయి. అయితే సరిహద్దు ప్రాంతమైన నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో మాత్రం కేవలం 19 దరఖాస్తులు మాత్రమే వచ్చి రాష్ట్రంలోనే అత్యల్ప పోటీ నమోదైన ప్రాంతంగా నిలిచింది. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో బార్ కోసం 90 దరఖాస్తులు రాగా, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బార్‌కు 78 అప్లికేషన్లు వచ్చాయి. పాలమూరు జిల్లా పరిధిలోని దేవరకద్రలో 90, మద్దూర్‌లో 58, మక్తల్‌లో 38 మంది దరఖాస్తు చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి బార్‌కు 36 రాగా, సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని బార్ కోసం 27 దరఖాస్తులు దాఖలయ్యాయి.
Related Reading
Frequently Asked Questions
What is త ల గ ణల క క క?త ల గ ణల క క క is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does త ల గ ణల క క క matter?త ల గ ణల క క క matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.