IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

తెలంగాణలోని సర్కారు బడి బాగుకు రూ.640 కోట్లు

Published October 20, 2026 · Updated October 20, 2026 · By Susan Taylor - indiabreakingdaily.com

Foto : Susan Taylor - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – త ల గ ణల న సర క - హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పేద విద్యార్థులకు హైటెక్ విద్యను అందించేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు ఖర్చు చేయబోతోంది. నాబార్డ్ గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి (ఆర్‌‌‌‌‌‌‌‌ఐడీఎఫ్) ద్వారా స్కూళ్ల సమగ్ర అభివృద్ధి కోసం ఏకంగా రూ.640.67 కోట్లను తాజాగా మంజూరు చేసింది. దీనికి సంబంధించి ఇటీవల రెండు సవరించిన జీవోలనూ సర్కారు రిలీజ్ చేసింది. వీటితో సర్కారు బడులు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల రూపురేఖలు మారనున్నాయి.

నాబార్డ్ ఆర్‌‌‌‌‌‌‌‌ఐడీఎఫ్-29 కింద రూ.352.80 కోట్లను సర్కారు కేటాయించింది. ప్రభుత్వ బడులను డిజిటలైజ్ చేయడంలో భాగంగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) మౌలిక వసతులను భారీగా విస్తరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు , గురుకుల విద్యాసంస్థల్లో డెస్క్‌‌‌‌‌‌‌‌టాప్ కంప్యూటర్లు, అవసరమైన విద్యుదీకరణ, వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌‌‌‌‌‌‌‌వర్కింగ్ సౌకర్యాలు కల్పించనున్నారు. గతంలో కేజీబీవీల్లో డిజిటల్ క్లాసు రూములు ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ.. విద్యార్థినులకు మరింత సమర్థవంతంగా విద్యాబోధన అందేలా నాబార్డ్ ఆమోదంతో ప్రణాళికలో మార్పు చేశారు. కేజీబీవీ విద్యార్థినులకు నేరుగా వ్యక్తిగత ట్యాబ్లెట్లతో పాటు క్లాసు రూముల్లో స్క్రీన్ టీవీలు అందించాలని నిర్ణయించారు. ఈ పరికరాల కొనుగోళ్లు, కంప్యూటర్ల నెట్‌‌‌‌‌‌‌‌వర్కింగ్ పనులకు సంబంధించిన ఈ-టెండర్ ప్రక్రియ నిర్వహణ బాధ్యతలను టీజీటీఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌కు అప్పగించారు.

వసతులకు రూ.287.87 కోట్లు.. బడుల్లో భవనాల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనుల కోసం నాబార్డ్ ఆర్‌‌‌‌‌‌‌‌ఐడీఎఫ్-28 కింద రూ.287.87 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గతంలో కేటాయించిన పనుల ప్రాంతాల్లో నాబార్డ్ అనుమతితో జిల్లాల వారీగా మార్పులు చేశారు. అయితే, ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌ కింద గతంలో మంజూరై ఇప్పటివరకు పనులు ప్రారంభం కాని వాటన్నింటినీ ప్రభుత్వం రద్దు చేసింది. ఏండ్ల తరబడి కాగితాలకే పరిమితమైన పనులను పక్కనబెట్టి, ఇప్పటికే గ్రౌండ్ అయిన పనులతో పాటు తప్పనిసరిగా అవసరమైన నూతన లొకేషన్లకే పరిపాలనా అనుమతులను ఖరారు చేసింది. నిధులు నిరుపయోగం కాకుండా, నిజమైన అవసరమున్న స్కూళ్లకే ప్రాధాన్యతనిస్తూ జిల్లాల వారీగా సవరించిన పనుల జాబితాను ఖరారు చేశారు. అయితే, సర్కారు బడుల్లో ఐసీటీ పరికరాల సరఫరా, మౌలిక వసతుల పనులను పక్కా పారదర్శకతతో, నిర్దేశిత ప్రమాణాలకు లోబడి పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Related Reading

Frequently Asked Questions

What is త ల గ ణల న సర క?

త ల గ ణల న సర క is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does త ల గ ణల న సర క matter?

త ల గ ణల న సర క matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.