డ్రగ్స్‏కు అడ్డాగా గోవా.. డ్రగ్ డీలర్లంతా ఇక్కడే ఉన్నరు: సీఎం రేవంత్

cm-revanth-reddy-participated-in-the-goy-rabbon-padayatra-in-goa_NxsKGCgfhJ

Indiabreakingdaily.com – డ రగ స క అడ డ గ – పనాజి: గోవా రాష్ట్రం డ్రగ్స్‎కు అడ్డాగా మారిందని.. డ్రగ్ డీలర్లంతా గోవాలోనే ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‎లో దొరుతుకున్న డ్రగ్స్ అన్నీ గోవా నుంచే వస్తున్నాయని పేర్కొన్నారు. తాను సీఎం అవ్వక ముందు హైదరాబాద్‎లో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరికేవని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే డ్రగ్స్ కట్టడి కోసం ఈగల్ ఫోర్స్ పేరుతో ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపామని తెలిపారు.

ఆదివారం (అక్టోబర్ 11) గోవాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన గోయ్ రాభోన్న్ పాదయాత్రలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నషా ముక్త్ భారత్ పిలుపును గోవా సీఎం ప్రమోద్ సావంత్ అమలు చేయరా అని ప్రశ్నించారు. మీ నాయకుడి ఆదేశాలను కూడా పట్టించుకోరా అని నిలదీశారు.

గోవాలో డ్రగ్స్ కట్టడికి సావంత్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ సర్కారే ఉంది కదా.. డ్రగ్ స్మగ్లింగ్‎ను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారని సూటిగా ప్రశ్నించారు. ప్రముఖ టూరిస్ట్ స్పాట్‎గా గుర్తింపు పొందిన గోవాకు డ్రగ్స్ అడ్డా అన్న చెడ్డపేరు అవసరమా అన్నారు. గోవాను బీజేపీ సర్వ నాశనం చేస్తోందని విమర్శించారు.

►ALSO READ | శ్రీశైలం మహాక్షేత్రంలో.. ఘనంగా దసరా మహోత్సవాలు షురూ

ప్రభుత్వ స్థలాలను ఇతరులకు కట్టబెట్టడంతో పాటు పర్యావరణాన్ని నాశనం చేస్తోందని ఫైర్ అయ్యారు. గోవా ప్రజల పట్ల బీజేపీ వివక్ష చూపిస్తోందని నిప్పులు చెరిగారు. త్వరలో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతుందని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. గోవాకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని చెప్పారు.

Frequently Asked Questions

What is డ రగ స క అడ డ గ?

డ రగ స క అడ డ గ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does డ రగ స క అడ డ గ matter?

డ రగ స క అడ డ గ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *