IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

జైస్వాల్ జోరు, రోహిత్ రచ్చ.. ఆఫ్ఘన్‌పై భారత్ ఘన విజయం.. 3–0తో సిరీస్ కైవసం!

Published June 21, 2026 · Updated July 21, 2026 · By Nancy Anderson - indiabreakingdaily.com

Foto : Nancy Anderson - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – జ స వ ల జ ర ర - India vs Afghanistan 3rd ODI: చెన్నైలోని ఎంఏ చిదంబరం (చెపాక్) స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత జట్టు అన్‌స్టాపబుల్ పర్ఫామెన్స్‌తో రచ్చ లేపింది. ఆఫ్ఘన్ నిర్దేశించిన 219 పరుగుల టార్గెట్‌ను ఇండియన్ బ్యాటర్లు ఆడుతూ పాడుతూ కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి ఊదేశారు. ఈ ఘన విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 3–0తో క్లీన్ స్వీప్ చేసి ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది.

షాహిదీ సెంచరీతో పోరాడిన ఆఫ్ఘన్: ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘనిస్థాన్‌కు భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ (5 వికెట్లు) పవర్ ప్లేలోనే చుక్కలు చూపించాడు. కేవలం 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడ్డ ఆఫ్ఘన్ జట్టును ఆ జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. అద్భుతమైన క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన షాహిదీ వన్డేల్లో తన మొట్టమొదటి సెంచరీ (102 పరుగులు) నమోదు చేయగా, ఆల్ రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (50) అతనికి సూపర్ సపోర్ట్ ఇచ్చాడు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది.

రోహిత్-జైస్వాల్ రుద్రరూపం: 219 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మలు బుల్లెట్ లాంటి స్టార్ట్ ఇచ్చారు. ఆఫ్ఘన్ బౌలర్లకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా బౌండరీల వర్షం కురిపించారు. ఇద్దరూ పోటీ పడుతూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాక మరింత రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే మొదటి వికెట్‌కు ఏకంగా 170 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను వన్ సైడ్ చేసేశారు.

జైస్వాల్ గెలుపు శతకం: బాగా ఆడుతున్న రోహిత్ శర్మ (69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 రన్స్) చేసి సెంచరీ మార్క్‌ వైపు దూసుకెళ్తుండగా.. మహమ్మద్ నబీ బౌలింగ్‌లో ఒక భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. బౌండరీ లైన్ దగ్గర ఉన్న సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ సెడిఖుల్లా అటల్‌కు క్యాచ్ ఇచ్చి హిట్ మ్యాన్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వన్ డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి జైస్వాల్ తన విధ్వంసాన్ని కంటిన్యూ చేశాడు. ఈ క్రమంలోనే జైస్వాల్ అద్భుత సెంచరీ పూర్తి చేసుకోగా, భారత్ 9 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను ముగించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.