గ్రామసభ అనంతరం సర్పంచ్ భర్త ఆత్మహత్యా యత్నం.. కరీంనగర్ జిల్లాలో ఘటన

Share: X Facebook
sarpanchs-husband-attempts-to-end-life-after-gram-sabha-in-karimnagar-district_7ryPYI15JE

కరీంనగర్‌లో గ్రామసభ తర్వాత సర్పంచ్ భర్త ఆత్మహత్య యత్నం

Indiabreakingdaily.com – గ ర మసభ అన తర సర ప – కరీంనగర్ జిల్లాలో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గ్రామసభ సమావేశం ముగిసిన తర్వాత నారాయణపూర్ గ్రామ సర్పంచ్ దీకొండ లక్ష్మి భర్త దీకొండ మధు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ సంఘటన బుధవారం (ఆగస్టు 05) జరిగింది.

గ్రామసభ అనంతరం మధు ఇంటికి వేగంగా వెళ్లారు. అక్కడ ఉన్న మందులను అధిక మోతాదులో తీసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు భయపడి వెంటనే కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

కుటుంబ సభ్యుల ఆరోపణలు

నారాయణపూర్ ముంపు గ్రామ విషయంలో గ్రామస్తులు మధుపై తప్పుడు ప్రచారాలు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామ వాట్స్‌యాప్ గ్రూప్‌లలో సర్పంచ్‌పై విమర్శలు చేశారని, ఆవేదనతోనే ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశారని చెబుతున్నారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.

ఎమ్మెల్యే పరామర్శ

చికిత్స పొందుతున్న మధును చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్ లక్ష్మిని, ఆమె భర్తను గ్రామంలోని కొందరు వేధింపులకు గురిచేశారని ఎమ్మెల్యే తెలిపారు.

గతంలో తనకు ఎదురవుతున్న అవమానాలను చెబితే అండగా ఉంటానని చెప్పానన్నారు. మెరుగైన చికిత్స కోసం అవసరమైతే హైదరాబాద్ తరలిస్తామన్నారు.

సర్పంచ్ లక్ష్మి వివరణ

సర్పంచ్ లక్ష్మి మాట్లాడుతూ గ్రామంలోని కొందరు కులవివక్షతో ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తూ తీర్మానం చేయాలని ఇవాళ గ్రామ కార్యదర్శి ముందే వార్డు సభ్యులు తమపై ఒత్తిడి తెచ్చారని లక్ష్మి చెప్పారు.

అంతేకాదు, తన భర్త కమీషన్లు తీసుకుంటున్నారని, ముంపునకు గురైన గృహాల వాళ్ల నుంచి డబ్బులు తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో పెట్టారని లక్ష్మి ఆరోపించారు. ఇలాంటి అవమానాలన్నీ భరించలేకనే తన భర్త ఇవాళ గోలీలు వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడని సర్పంచ్ లక్ష్మి వివరించారు.

Frequently Asked Questions

What is గ ర మసభ అన తర సర ప?

గ ర మసభ అన తర సర ప is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does గ ర మసభ అన తర సర ప matter?

గ ర మసభ అన తర సర ప matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *